Chandramukhi 2: చంద్రముఖి 2 ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

|

Oct 04, 2023 | 3:24 PM

డైరెక్టర్ పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. మరోసారి చంద్రముఖి సినిమానే వెండితెరపై చూపించారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అటు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. దీంతో చంద్రముఖి 2 బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం మాత్రం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

Chandramukhi 2: చంద్రముఖి 2 ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Chandramukhi 2
Follow us on

భారీ అంచనాల మధ్య విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సినిమా చంద్రముఖి 2. 2005లో సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సినిమా చంద్రముఖి 2. డైరెక్టర్ పీ.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. మరోసారి చంద్రముఖి సినిమానే వెండితెరపై చూపించారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అటు మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదు. దీంతో చంద్రముఖి 2 బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రభావం మాత్రం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 8 కోట్లు పెట్టి ఓటీటీ రైట్స్ కొనుగులో చేసిందని టాక్. సినిమా విడుదలైనప్పటి నుంచి దాదాపు 45 రోజుల తర్వాత అంటే నెలన్నర తర్వాత ఈ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారట. ఈ సినిమాను ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. నవంబర్ మూడో వారంలో నెట్ ఫ్లి్క్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. చంద్రముఖి 2 సినిమా కోసం రాఘవ లారెన్స్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా కోసం లారెన్స్ దాదాపు రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ సినిమాలో వడివేలు, రావు రమేశ్, లక్ష్మీ మీనన్ మహిమ నంబియార్, రాధిక శరత్ కుమార్ కీలకపాత్రలలో నటించారు.

అయితే ఏక్ నిరంజన్ తర్వాత చంద్రముఖి 2 సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ కంగనా. ఈ మూవీతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ సత్తా చాటలేకపోయింది. దీంతో ఇప్పుడు తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టింది కంగనా. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ సినిమా ప్రమోషన్స్ లలో పాల్గొంటుంది. ఇందులో ఇందిరా గాంధి పాత్రలో కనిపించనుంది. అలాగే తేజస్ చిత్రంలోనూ నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక అక్టోబర్ 2న విడుదలైన తేజస్ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.