పొలిటికల్ ఫ్రేమ్‌లో వర్మ..ఇకముందు ట్విస్టులే ట్విస్టులు

| Edited By: Ram Naramaneni

Oct 28, 2019 | 6:35 PM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరో సెన్సేషన్‌కు సిద్ధమయ్యాడు. కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు పేరుతో వర్మ తీసిన చిత్రం ఇప్పుడు యూట్యూబ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీపావళి కానుకగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలవ్వగా.. అందులో చంద్రబాబు, జగన్, నారా లోకేష్, కేఏ పాల్, పవన్ కల్యాణ్.. ఇలా పలువురి పాత్రల గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పకనే చూపించాడు ఈ వివాదాల దర్శకుడు. దీంతో ఇప్పుడు మళ్లీ అందరి నోళ్లలో హాట్ టాపిక్‌ అయిపోయాడు […]

పొలిటికల్ ఫ్రేమ్‌లో వర్మ..ఇకముందు ట్విస్టులే ట్విస్టులు
Follow us on

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరో సెన్సేషన్‌కు సిద్ధమయ్యాడు. కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లు పేరుతో వర్మ తీసిన చిత్రం ఇప్పుడు యూట్యూబ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీపావళి కానుకగా ఈ మూవీ ట్రైలర్‌ విడుదలవ్వగా.. అందులో చంద్రబాబు, జగన్, నారా లోకేష్, కేఏ పాల్, పవన్ కల్యాణ్.. ఇలా పలువురి పాత్రల గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పకనే చూపించాడు ఈ వివాదాల దర్శకుడు. దీంతో ఇప్పుడు మళ్లీ అందరి నోళ్లలో హాట్ టాపిక్‌ అయిపోయాడు వర్మ.

అయితే ఇలాంటి సెన్సేషనల్‌ను సృష్టించడం ఆయనకు కొత్తేం కాదు. ఎన్నికలకు ముందు కూడా ఆయన తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సృష్టించిన వివాదాన్ని ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ఈ వివాదంలో ఏపీ, తెలంగాణాలో ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఎన్నికల ఫలితాల తరువాత కూడా చంద్రబాబు, పవన్‌లను టార్గెట్ చేస్తూ వర్మ సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు చేస్తూనే వస్తున్నారు. దీనిపై ఎన్ని వివాదాలు జరిగినా.. విమర్శలు వచ్చినా.. ఆయన ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఇక ఇప్పుడు కమ్మ రాజ్యంలోకి కడప రెడ్లుపై కూడా వివాదం మొదలైంది.

ఈ సినిమా టైటిల్, కథపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఫిర్యాదు చేశారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా టైటిల్‌ను నిషేధించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కులాల మధ్య గొడవలు సృష్టిస్తూ.. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ ఉందన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులను ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకుంటారని.. కులాల పేరుతో కాదని ఈ లేఖలో తెలిపారు. రామ్ గోపాల్ వర్మపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. చూస్తుంటే ఈ వివాదం ఇప్పటితో ఆగేలా లేదని అర్థమవుతోంది.

అయితే వర్మ.. ఓ మంచి దర్శకుడు. వైవిధ్యానికి పెట్టింది పేరు. దర్శకుడిగా ఆయన ఎన్నో సెన్సేషనల్ హిట్లను కూడా అందుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆయన గ్రాఫ్ బాగా పడిపోయింది. ఇలాంటి సమయంలో మంచి సినిమాలను తెరకెక్కించుకోకుండా.. ఇలాంటి వివాదాస్పద కథలను ఎంపిక చేసుకోవడంపై ఆయన ఆంతర్యమేంటోనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.