విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా విక్రమ్ (Vikram). అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో కమల్తోపాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ మూవీలో అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో సూర్య కీలకపాత్రలో నటిస్తుండడంతో.. విక్రమ్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజ్ కమల్ ఫీలింస్ ఇంటర్నేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సిని మా పాన్ ఇండియా లెవల్లో జూన్ 3న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ విక్రమ్ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ను ఇచ్చింది. ఈ విషయన్ని మేకర్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.. కీలకమైన సెన్సార్ ప్రక్రియ సైతం పూర్తికావడంతో విక్రమ్ సినిమా విడుదలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసే పనిలో పడ్డారు మేకర్స్. అలాగే ఈ సినిమా దాదాపు మూడు గంటలు.. అంటే 173 నిమిషాల రన్ టైమ్ ఉండనున్నట్లుగా సమాచారం. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీంతం ఆకట్టుకుంది.
#Vikram censored with U/A certificate. #kamalhaasan #VikramFromJune3 @ikamalhaasan @Dir_Lokesh @Udhaystalin @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial #Mahendran @RKFI @turmericmediaTM @SonyMusicSouth @RedGiantMovies_ pic.twitter.com/XOygdGyKje
— Raaj Kamal Films International (@RKFI) May 25, 2022