Kamal Haasan: గట్స్‌ అండ్‌ గన్స్‌.. మెషీన్ గన్స్‌తో కమల్‌ హాసన్ ఫైరింగ్‌.. వైరల్‌ వీడియో చూశారా?

|

Sep 08, 2023 | 6:40 PM

లోక నాయకుడు కమల్‌హాసన్‌ నటించిన విక్రమ్‌ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కమల్‌ హాసన్‌కు గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. కమల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, స్టైల్‌ అదిరిపోయాయని ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాను కమల్‌ హాసన్‌ స్వయంగా నిర్మించడం విశేషం. ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతన్నాడీ సీనియర్‌ హీరో. ఖాకీ, నెర్కొండ పార్వై, వలిమై, తునివు (తెలుగులో తెగింపు) వంటి సినిమాలతో సత్తా చాటిన హెచ్‌ వినోద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Kamal Haasan: గట్స్‌ అండ్‌ గన్స్‌.. మెషీన్ గన్స్‌తో కమల్‌ హాసన్ ఫైరింగ్‌.. వైరల్‌ వీడియో చూశారా?
Kamal Haasan
Follow us on

లోక నాయకుడు కమల్‌హాసన్‌ నటించిన విక్రమ్‌ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కమల్‌ హాసన్‌కు గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ ఇచ్చింది. కమల్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, స్టైల్‌ అదిరిపోయాయని ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాను కమల్‌ హాసన్‌ స్వయంగా నిర్మించడం విశేషం. ఇప్పుడు మరో సినిమాకు రెడీ అవుతన్నాడీ సీనియర్‌ హీరో. ఖాకీ, నెర్కొండ పార్వై, వలిమై, తునివు (తెలుగులో తెగింపు) వంటి సినిమాలతో సత్తా చాటిన హెచ్‌ వినోద్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. KH 233 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను కూడా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్నారు. విక్రమ్‌ తర్వాత రిలీజవుతోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌ను డైరెక్టర్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే సినిమా సెట్స్‌పైకి వెళ్లేముందే కమల్‌ అన్ని రకాలుగా రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా గన్‌ ఫైరింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది చిత్రబృందం. ‘గట్స్‌ అండ్‌ గన్స్‌’ పేరుతో రిలీజ్‌ చేసిన ఈ వీడియోలో కమల్ వివిధ రకాలె మెషీన్‌ గన్స్‌తో ఫైరింగ్‌ చేయడం చూడవచ్చు. ఫుల్‌ మ్యాగజైన్‌ ఖాళీ అయ్యేంతవరకు గ్యాప్‌ లేకుండా గన్‌ ఫైరింగ్‌ చేశారాయన. #Rise To Rule అనే హ్యాష్‌ ట్యాగ్‌తో షేర్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కమల్‌ గన్‌ ఫైరింగ్‌ సీన్స్‌ను చూసి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ‘వావ్‌, సూపర్బ్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సినిమా కాకుండా కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898 AD’. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం కమల్ ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌ వంటి స్టార్‌ నటులు భాగమయ్యారు. ఇక కమల్‌ 233వ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అక్టోబర్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో పాటు ఇండియన్‌ 2 మూవీలోనూ నటిస్తున్నారు కమల్. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కమల్ హాసన్ ఫైరింగ్ ప్రాక్టీస్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.