AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian 2: భారీ ధరకు అమ్ముడైన ఇండియన్ 2 డిజిటల్ రైట్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగలేసిందే

ఇండియన్ 2 లో మరోసారి వృద్దుడిగా కనిపించనున్నారు లోకనాయకుడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ కు బ్రేక్ లు పడుతూ వస్తున్నాయి.

Indian 2: భారీ ధరకు అమ్ముడైన ఇండియన్ 2 డిజిటల్ రైట్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగలేసిందే
Indian 2
Rajeev Rayala
|

Updated on: Jul 24, 2023 | 7:00 PM

Share

ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఇండియన్ 2. 1996లో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు ఇండియన్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  గతంలో వచ్చిన ఇండియన్ సినిమా పెద్ద హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో కమల్ హాసన్ రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. యంగ్ కమల్ హాసన్ గా అలాగే వృద్దుడిగాను నటించి ఆకట్టుకున్నారు కమల్. ఇక ఇప్పుడు వస్తున్న ఇండియన్ 2 లో మరోసారి వృద్దుడిగా కనిపించనున్నారు లోకనాయకుడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ కు బ్రేక్ లు పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే శంకర్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు సినిమాలను ఒకే సారి పూర్తి చేస్తున్నాడు శంకర్.

ఇక ఇండియన్ 2 కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు రికార్డులు క్రియేట్ చేస్తుందని తెలుస్తోంది. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ భారీ ధరకు జరుగుతుందని టాక్.

తాజాగా ఇండియన్ 2 డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ దాదాపు రూ.200 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇండియన్ 2 మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.