Hijab Row: చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. హిజాబ్‌ వివాదం పై స్పందించిన కమల్

|

Feb 09, 2022 | 11:29 AM

హిజాబ్‌ ఇష్యూ కర్ణాటకను కుదిపేస్తోంది. ఉడుపిలో షురూ అయిన ఈ రగడ..దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలకు కూడా పాకింది.

Hijab Row: చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. హిజాబ్‌ వివాదం పై స్పందించిన కమల్
Kamal Haasan
Follow us on

Hijab Row: హిజాబ్‌ ఇష్యూ కర్ణాటకను కుదిపేస్తోంది. ఉడుపిలో షురూ అయిన ఈ రగడ..దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలకు కూడా పాకింది. హిజాబ్ వివాదంతో అట్టుడికిపోతున్నాయి. ఇక శివమొగ్గలో ఓ కాలేజ్‌ ఆవరణలో కాషాయ జెండా ఎగురవేశారు. ఇప్పుడదే ప్రాంతంలో అదే పోల్‌పై NSUI ఆధ్వర్యంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. హిజాబ్‌, కాషాయ కండువాల రగడపై నటుడు కమల్ హాసన్‌ స్పందించారు. కర్ణాటకలో జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయని అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కమల్ కామెంట్‌ చేశారు. కర్ణాటక ఇష్యూ పొరుగు రాష్ట్రాల వరకూ రాకూడదు. తమిళనాడు సహా అందరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమిదంటూ ట్విట్టర్‌లో వెల్లడించారు.

హిజాబ్‌ వివాదం కర్నాటకలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మూడురోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరి నమ్మకాలు వారివని , రాజ్యాంగమే తమకు దైవమని ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరోవైపు హిజాబ్‌ వివాదంపై కర్నాటక హైకోర్టులో కీలక విచారణ జరిగింది. అన్నివర్గాల ఆచారసాంప్రదాయాలను తాము గౌరవిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్ధులు రోడ్డెక్కకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. హిజాబ్‌ వివాదంపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది కోర్ట్. హిజాబ్‌ వివాదం కారణంగా విద్యాసంస్థల్లో హింస చెలరేగడంతో కర్నాటక ప్రభుత్వం స్కూళ్లు , కాలేజ్‌లకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. జనవరి 1న ఉడుపి PU కాలేజీలో హిజాబ్‌ ధరించిన యువతులను కాలేజీలోకి అనుమతించలేదు యాజమాన్యం. వారు హిజాబ్‌ ధరిస్తే మేం కాషాయ కండువాలను వేసుకుంటాం..అంటూ పోటాపోటీ నెలకొంది. కొందరు హిజాబ్‌లు..మరికొందరు కాషాయ కండువాలతో హాజరవడం చినికి చినికి గాలివానలా మారింది. లేటెస్ట్‌గా హింసకు దారితీసింది. లాఠీచార్జ్‌లు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం వరకు వెళ్లింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

WHO Warning: తదుపరి కోవిడ్‌ వేరియంట్‌ తీవ్రతరం కావచ్చు.. డబ్ల్యూహెచ్‌ హెచ్చరిక..!

Thalapathy Vijay: మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్.. ఈసారి ఇలా రాబోతున్నారట..

Uttarakhand Elections: ఉత్తరాఖండ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ప్రచారం నిర్వహించనున్న మోడీ, అమిత్ షా