AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Elections: ఉత్తరాఖండ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ప్రచారం నిర్వహించనున్న మోడీ, అమిత్ షా

ఉత్తరాఖండ్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన స్టార్ క్యాంపెయినర్‌లను రంగంలోకి దించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. 

Uttarakhand Elections: ఉత్తరాఖండ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ప్రచారం నిర్వహించనున్న మోడీ, అమిత్ షా
Modi Amit Shah
Balaraju Goud
|

Updated on: Feb 09, 2022 | 11:10 AM

Share

Uttarakhand Assembly Election 2022: ఉత్తరాఖండ్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) తన స్టార్ క్యాంపెయినర్‌లను రంగంలోకి దించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) తర్వాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు.  ఫిబ్రవరి 11 న హల్ద్వానీలోని రాంలీలా మైదాన్‌లో జరిగే ఎన్నికల బహిరంగ సభలో అమిత్ షా  ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు అమిత్ షా యూపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే ఫిబ్రవరి 14న రాష్ట్రంలో జరిగే పోలింగ్‌కు ముందు ఆయన ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారు. అదే సమయంలో హోంమంత్రి ర్యాలీని విజయవంతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీగా సన్నాహాలు ప్రారంభించింది.

మరోవైపు, ర్యాలీని విజయవంతం చేసేందుకు జిల్లా నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు హల్ద్వానీకి చేరుకుంటారు. పార్టీ అభ్యర్థి యోగేంద్ర సింగ్ రౌతేలాకు మద్దతుగా హల్ద్వానీలో ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. అమిత్ షా ర్యాలీని ఇతర జిల్లాలలో ప్రచారం చేయడానికి బీజేపీ సన్నాహాలు చేసింది. చుట్టుపక్కల అసెంబ్లీ ప్రజలు కూడా వర్చువల్ మీడియం ద్వారా ర్యాలీలో పాల్గొంటారు. ఫిబ్రవరి 11న హల్ద్వానీ రాంలీలా మైదాన్‌లో హోంమంత్రి షా ర్యాలీకి చేరుకోవాలని బీజేపీ బుధవారం నుంచి పట్టణ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అంతకుముందు అమిత్ షా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోడీ డిసెంబర్‌లో హల్ద్వానీ, డెహ్రాడూన్‌లలో ప్రచారం నిర్వహించారు.

అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రంలో నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగు రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేశారు. మరోవైపు ఫిబ్రవరి 12న ఖాతిమా, కోట్‌ద్వార్‌, రూర్కీలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో పాటు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు ఆ రాష్ట్రంలో ప్రచారం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే, ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థుల కష్టాలను రెబల్స్ పెంచుతున్నారు. రాష్ట్రంలో డజనుకు పైగా రెబల్ బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిని ఒప్పించి బీజేపీ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని రాష్ట్ర నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

Read Also… India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. . ఒక్కరోజులోనే 1,217 మంది వైరస్‌తో మృతి