Kamal Haasan: కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్.. ఈ కొత్త వీడియో చూశారా ?.. గూస్‏బంప్స్ అంతే..

దాదాపు 36 ఏళ్ల తర్వాత డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ సినిమా చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా నాయకుడు. అప్పట్లో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది. అదే థగ్ లైఫ్. ఈరోజు (నవంబర్ 7) కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ షేర్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

Kamal Haasan: కమల్ హాసన్ బర్త్ డే స్పెషల్.. ఈ కొత్త వీడియో చూశారా ?.. గూస్‏బంప్స్ అంతే..
Kamal Haasan

Updated on: Nov 07, 2023 | 6:55 AM

Kamal Haasan Birthday: ఇటీవలే విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కమల్ హాసన్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈసినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు కమల్. దాదాపు 36 ఏళ్ల తర్వాత డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ సినిమా చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా నాయకుడు. అప్పట్లో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ రాబోతుంది. అదే థగ్ లైఫ్. ఈరోజు (నవంబర్ 7) కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ గ్లింప్స్ షేర్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడూ పట్టాలు ఎక్కుతుందా ?.. అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ తారాగణం నటించనున్నట్లు తెలుస్తోంది.

కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో ఫైట్ సీక్వెన్స్ ను రిలీజ్ చేస్తూ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. మణిరత్నం టేకింగ్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, కమల్ హాసన్ స్క్రీన్ ప్లే ప్రెజన్స్.. మొత్తానికి టైటిల్ గ్లింప్స్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, త్రిష, జయం రవి కీలకపాత్రలలో నటిస్తున్నట్లు చిత్రయూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో మూవీపై మరింత క్యూరియాసిటి నెలకొంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కమల్ భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో సిద్ధార్థ్, రకుల్, కాజల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈరోజు కమల్ బర్త్ డే కావడంతో ఆయన నటిస్తోన్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.