శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే షూటింగ్ కొంతమేరక్ జరుపుకున్న భారతీయుడు 2.. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చేరుకుంది. భారతీయుడు చిత్ర యూనిట్ కడప గడపలో అడుగు పెట్టింది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా కమల్ హాసన్ కడప జిల్లాకి వచ్చారు. జమ్మలమడుగు గండికోటలో భారతీయుడు-2 సినిమా 6 రోజులపాటు షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా కడపకు విచ్చేసిన కమల్ సందడి చేశారు. కమల్‌హసన్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు, అభిమానులు పోటెత్తారు. అభిమానులందరికీ కమల్ అభివాదం చేశారు.
కడప గడపలో కమల్
‘భారతీయుడు’ సినిమా 1996లో రిలీజై సంచలన నిజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యుయెల్ రోల్ చేసి మెప్పించారు. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ నటన, హావభావాలు ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. భారతీయుడు సినిమా విడుదలైన పాతికేళ్లకు.. సీక్వెల్ గా ‘భారతీయుడు-2’ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలోనూ కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత దర్శకనిర్మాతల మధ్య కొన్ని వివాదాలు రావడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది.
అంతా సద్దుమణిగి కొద్ది రోజుల క్రితం ఈ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..