Thug Life Movie Twitter Review: థగ్ లైఫ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. కమల్, మణిరత్నం కాంబోపై పబ్లిక్ రియాక్షన్స్..

దాదాపు 30 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్ అయ్యింది. నాయగన్ వంటి కల్ట్ క్లాసిక్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా థగ్ లైఫ్. ఈరోజు (జూన్ 5న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో త్రిష, శింబు, అభిరామి ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పటికే మూవీ చూసిన అడియన్స్ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

Thug Life Movie Twitter Review: థగ్ లైఫ్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. కమల్, మణిరత్నం కాంబోపై పబ్లిక్ రియాక్షన్స్..
కమల్‌ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ థగ్‌ లైఫ్‌. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కంటే ముందు ఈ సినిమాకు ఆ రేంజ్‌ బజ్‌ మాత్రం రాలేదు. కానీ అనేక వివాదాల్లో మాత్రం చిక్కుకుంది.

Updated on: Jun 05, 2025 | 7:27 AM

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన సినిమా థగ్ లైఫ్. నాయగన్ వంటి కల్ట్ క్లాసిక్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో దాదాపు 30 ఏళ్లకు వచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలో శింబు, త్రిష, అభిరామి ముఖ్య పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా పై విడుదలకు ముందే క్యూరియాసిటీని పెంచేసింది. ఏఆర్ రెహమాన్ బీజీఎం, పాటలు మరింత స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. కొన్ని రోజులుగా అటు వివాదాలు.. ఇటు ప్రచార కార్యక్రమాల మధ్య రోజు రోజుకీ మరింత బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో థగ్ లైఫ్ హంగామా మొదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

ఎప్పటిలాగే మణిరత్నం మార్క్ ఈ సినిమాలో కనిపించిందని.. కమల్ పర్ఫార్మెన్స్, రెహమాన్ బీజీఎం, శింబు యాక్టింగ్ ఈ సినిమాకు మరింత హైలెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని.. ఇక సెకండ్ ఆఫ్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సాగుతుందని.. గుడ్ మూవీ అనిపించుకునేలా ఉందని అంటున్నారు. ఇక శింబు తన పాత్రలో నటించలేదు.. జీవించేశాడని.. ఆయన కనిపించిన ప్రతీ సీన్ అదిరిపోయిందని.. ఇంటర్వెల్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..