Amigos: ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ అమిగోస్.. ఎప్పుడు.? ఎక్కడంటే..

|

Mar 04, 2023 | 8:01 AM

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్.

Amigos: ఓటీటీలోకి కళ్యాణ్ రామ్ అమిగోస్.. ఎప్పుడు.? ఎక్కడంటే..
Amigos
Follow us on

నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అమిగోస్ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన బింబిసార సినిమాలో డ్యూయల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్. అమిగోస్ సినిమాలో త్రిపాత్రాభినంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అయ్యింది. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.

కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అడుగు పెట్టనుంది. అమిగోస్ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసింది. ఇక ఈ సినిమాను మార్చ్ 10న స్ట్రీమింగ్ చేయనున్నారు. విడుదలకు ముందు అమిగోస్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గరనుంచి ఈ సినిమా పై బజ్ క్రియేట్ అయ్యింది. అమిగోస్ అంటే ప్రెండ్స్ అని అర్ధం.. ఒకేలా ఉండే ముగ్గురి కథతో ఈ సినిమా తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Amigos