చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్ దంపతులు విడాకులు తీసేసుకున్నారా..? తాజాగా కల్యాణ్ దేవ్ ఇన్ స్టా పోస్ట్ చూస్తే అదే అనిపిస్తుంది. వీరిద్దరూ చాలాకాలం నుంచి విడిగానే ఉంటున్నారు. మనస్పర్థలు వచ్చాయని.. దూరంగా ఉంటున్నారు.. అన్నీ కుదుటపడ్డాక మళ్లీ కలుస్తారులే అని అందరూ అనుకున్నారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే వారు విడాకులు తీసుకున్నట్లే అనిపిస్తుంది. తాజాగా తన కుమార్తె నవిష్కతో ఉన్న ఫోటోలు షేర్ చేసిన కల్యాణ్.. వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపే నాలుగు ఇవే అంటూ క్యాప్షన్ ఇచ్చారు. మాములుగా దంపతులు విడాకులు తీసుకున్నప్పుడు.. లేదా కోర్టులో హియరింగ్స్ జరుగుతున్నప్పుడు ఫ్యామిలీ కోర్టు ఇలాంటి రూల్స్ పాస్ చేస్తూ ఉంటుంది. వాదోపవాదనలు విని.. పిల్లలు ఎవరి వద్ద ఉండాలి.. వారిని తల్లి లేదా తండ్రి ఎప్పుడు కలవాలి.. ఎన్ని గంటలు వారితో ఉండాలి అని నిర్ణయిస్తుంది. కల్యాణ్ దేవ్ పోస్ట్‌ను బట్టి అతడు నవిష్కతో వారానికి 4 గంటలు మాత్రమే గడుపుతున్నట్లు అర్థమవుతుంది.
తొలుత శ్రీజ తన సామాజిక మాధ్యమాల నుంచి కళ్యాణ్ దేవ్ నేమ్ రిమూవ్ చేయడంతో.. వీరిద్దరి డివోర్స్ వదంతలు వ్యాపించాయి. ఆ తర్వాతి కాలంలో మెగా ఫ్యామిలీ ఈవెంట్స్‌లో కల్యాణ్ దేవ్ లేకుండానే శ్రీజ కనిపించడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. శ్రీజతో డిఫరెన్స్‌స్ అనేే విషయం బయటకు వచ్చాక.. కళ్యాణ్ దేవ్ హీరోగా చేసిన 2 మూవీస్ సూపర్ మచ్చి, కిన్నెరసాని విడుదల అయ్యాయి. వాటికి మెగా కాంపౌండ్ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. మధ్యమధ్యలో నవిష్కతో మాత్రమే ఫోటోలు పోస్ట్ చేస్తున్న కల్యాణ్ దేవ్.. తాజా పోస్ట్‌తో పూర్తి క్లారిటీ ఇచ్చేసినట్లే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.