గూగుల్ ట్రెండ్స్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 సినిమాల జాబితాను విడుదల చేసింది. వీటిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాలకు స్థానం దక్కింది. ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమాల్లో ‘స్త్రీ 2’ ఒకటి. ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో ఉంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఇక రెండో స్థానంలో ‘కల్కి 2898 AD’ సినిమా ఉంది. ఈ సినిమాలో టాప్ టాలీవుడ్, హిందీ ఆర్టిస్టులు ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తదితర సినీ ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాతి స్థానంలో ’12 వ ఫెయిల్’ సినిమా నిలిచింది . తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ వసూళ్ల సాధించిన ఈ చిత్రానికి మూడో స్థానం దక్కింది. ఈసారి ఆస్కార్ రేసుకు భారత్ నుంచి ‘లపాటా లేడీస్’ సినిమా అధికారికంగా ఎంపికైంది. ఈ చిత్రానికి నాలుగో స్థానం దక్కింది.
ఇక తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలవడం విశేషం. అలాగే కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం విజయ్ సేతుపతి ‘మహారాజా’ ఆరో స్థానం కైవసం చేసుకుంది. మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’కు ఏడో స్థానం, దళపతి విజయ్ నటించిన ‘గోట్’ చిత్రానికి ఎనిమిదో స్థానం దక్కింది. ఇక ప్రభాస్ నటించిన ‘సలార్’ 9వ స్థానం, ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ 10వ స్థానంలో నిలిచాయి.
2024 Top trending searches for movies in Google#Stree2 #Kalki2898AD #12thfail #LaapataaLadies #HanuMan #Maharaja #ManjummelBoys #TheGreatestOfAllTime #Salaar #aavesham #ShraddhaKapoor #Prabhas𓃵 #FaFa #ThalapathyVijay𓃵 #VijaySethupathi pic.twitter.com/LrvEN1QL9j
— ShowTime (@ShowTimeTweetz) December 10, 2024
కాగా ఈసారి గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన సినిమాల్లో సౌత్ ఇండియాకు చెందినవే కావడం విశేషం. అయితే గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీని శాసిస్తోన్న కన్నడ సినిమాకు ఈసారి నిరాశ ఎదురైంది. టాప్-10లో కనీసం ఒక్క కన్నడ సినిమా కూడా లేదు.
Rebel Star #Prabhas Reigns Supreme in 2024! 🔥
Epic Blockbuster #Kalki2898AD leads the IMDb’s Most Popular Indian Movies, while both Kalki & #Salaar are trending on Google’s Top 10 Indian movies. pic.twitter.com/emysGKKXsG
— Telugu70mm (@Telugu70mmweb) December 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.