AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki 2898 AD Trailer: ప్రభాస్ ‘కల్కి’ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ మళ్లీ కాలర్ ఎగరేసుకోవచ్చు భయ్యో!

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

Kalki 2898 AD Trailer: ప్రభాస్ 'కల్కి' ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ మళ్లీ కాలర్ ఎగరేసుకోవచ్చు భయ్యో!
Kalki 2898 Ad Movie
Basha Shek
|

Updated on: Jun 10, 2024 | 7:29 PM

Share

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 AD. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి సినిమాను నిర్మించారు. ప్రభాస్, దీపికలతో పాటు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్, అలాగే మరో బాలీవుడ్ అందాల తార దిశా పటానీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్స్, పోస్టర్స్,  కల్కి సినిమాపై అంచనాలను పెంచేశాయి.  ముఖ్యంగా ప్రభాస్ బుజ్జి కారు దేశమంతా చక్కర్లు కొడుతోంది. దీంతో ఎప్పుడెప్పుడు కల్కి  సినిమాను థియేటర్లలో చూద్దామా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అన్ని  హంగులు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా సోమవారం (జూన్ 10) కల్కి సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కల్కి సినిమాలో ప్రభాస్‌ భైరవగా కనిపించనున్నాడు. అలాగే అమితాబ్ బచ్చన్‌ అశ్వత్థామగా, కమల్ హాసన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించనున్నారు.   వీరితో పాటు కల్కి సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, అన్నాబెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందించారు.ఇప్పటికే వీరి లుక్స్ కు సంబంధించిన పోస్టర్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ట్రైలర్ తోనే దుమ్ము రేపిన ప్రభాస్ సినిమా రిలీజయ్యాక మరెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్రభాస్ కల్కి ట్రైలర్ .. ఇదిగో..

ముంబైలో చక్కర్లు కొడుతోన్న  ప్రభాస్ బుజ్జి కారు.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?
ముద్దు పెట్టేటప్పుడు కళ్లు మూసుకోవడానికి కారణం తెలుసా?