
Kajal Aggarwal: పెళ్లైతే స్టార్ హీరోయిన్ల క్రేజ్ ఒక్కసారిగా పడిపోతుంది.. వాళ్లకు అవకాశాలు రావనేది పాత మాట. పెళ్లైనా.. తల్లైనా మాకేం అభ్యంతరం లేదు.. టాలెంట్ ఉంటే చాలంటున్నారు దర్శకులు. కానీ అసలు సమస్య అది కాదు. మరో కొత్త ఇష్యూ ఉందిక్కడ. అదే ఇప్పుడు కాజల్ అగర్వాల్‌కు ఎదురవుతుంది. ఇది ఆమెను కాస్త ఇబ్బంది కూడా పెడుతుందనుకోండి. ఇంకా చెప్పాలంటే పెళ్లైన హీరోయిన్లందరికీ అదే సమస్య. మరి అదేంటో తెలుసుకుందాం రండి..
సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మునుపటి కారెక్టర్స్ కోసమే చూస్తున్నారు కాజల్ అగర్వాల్. యంగ్ హీరోలతో ఆడిపాడాలనుకుంటున్నారు. అందుకే పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షోకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదు. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోషూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె NBK 108తో పాటు తమిళంలో కమల్ హాసన్ ఇండియన్ 2, హిందీలో మరో సినిమాతో బిజీగా ఉన్నారు.
కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ పర్లేదనిపిస్తుంది కానీ ఒకప్పట్లా ఆమె కోరుకుంటున్న ఆఫర్స్ మాత్రం రావట్లేదు. పెళ్లైపోయింది కాబట్టి సీనియర్ ముద్ర పడిపోయింది. అందుకే కుర్ర హీరోలు, స్టార్స్ ఈమె వైపు చూడట్లేదు. ఒకప్పుడు చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్స్‌తో నటించిన ఈమెకు ఇప్పుడంతా సీనియర్స్ నుంచే పిలుపొస్తుంది. సమంతలా ఈ జనరేషన్ హీరోల నుంచి కాజల్‌కు ఆఫర్స్ రావట్లేదు.
కాజల్ అగర్వాల్ ఇన్‌స్టా పోస్ట్..
పెళ్లికి ముందు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు దూరంగా ఉన్న కాజల్‌కు ఇప్పుడవే దిక్కయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఘోస్ట్లీతో పాటు మరో రెండు మూడు ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు ఓకే చెప్పారు చందమామ. దానికి కారణం ఆమెకు స్టార్స్ పట్టించుకోకపోవడమే. పెళ్లైన హీరోయిన్లలో చాలా మంది ఇదే సమస్య ఫేస్ చేస్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫర్స్ వస్తున్నా.. అందులో యంగ్ స్టార్స్ ఉండట్లేదు..సీనియర్లు మాత్రమే వారితో ఆడిపాడేందుకు రెడీ అంటున్నారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..