దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ కోసం మెగా.. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ స్నేహబంధాన్ని వెండితెరపై చూసేందుకు ఇరువురి ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఇప్పటికే ముంబయిలో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను జరుపుకున్న చిత్ర యూనిట్ శుక్రవారం దుబాయ్‌లో ఈవెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చరణ్ గురించి భావోద్వేగ కామెంట్స్ చేశారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. శివరాజ్ కుమార్ అన్నకు ధన్యవాదాలు.. పునీత్ సర్ ఇక్కడ లేరని నేను అనుకోను.. ఆయన పార్థివేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు నాకు అనిపించింది.. ఈ గాల్లో.. నేలకు.. మట్టిలో ఆయన ఉన్నట్టు అనిపించింది. అందుకే ఈరోజు చల్లని చిరుజల్లులతో మనల్ని పలకరించారు. పునీత్ సర్ మనతో లేడని నేను ఎప్పుడు ఏడ్వలేదు.. పునీత్ సర్ సెలబ్రెషన్స్.. అందుకే ఆయనను ఎప్పుడు సెలబ్రెట్ చేసుకుందాం.. నేను కన్నడలో మాట్లాడితే చూడాలని మా అమ్మ కోరం.. రాజ్ కుమార్ గారిని చూడాలని ఉండేది. కానీ నాకు ఆ భాగ్యం దక్కింది. చరణ్‌ది నాది బంధం. ఇది కేవలం సినిమా కాదు.. ప్రాంతీయ చిత్రాల హద్దులను చెరిపేసి భారతీయ సినిమాగా చేయాలని రాజమౌళి అనుకునేవాడు. ఇందులో నాకు చిన్న పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నారు ఎన్టీఆర్.
నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు నా అభిమానులు. మీ అభిమానంతోపాటు.. నా బ్రదర్ చరణ్ అభిమానులు మాకు దక్కారు. ఎల్లప్పుడూ మీ అందరూ.. ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు.. ఇంత ఒపిగ్గా ఎదురుచూస్తున్నందుకు పాదాభివందనం.. చెర్రీతో ఈ బంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. మా సాన్నిహిత్యం, స్నేహనికి దిష్టి పడకుండా ఉండాలని.. నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ భావోద్వేగమయ్యారు ఎన్టీఆర్..
Bheemla Nayak: భీమ్లా నాయక్‌లో పవన్ వాడిన బైక్‌ను సొంతం చేసుకోవాలా?.. అయితే ఇలా చేయండి
Pushpa 2: పుష్ప సీక్వెల్‌లోనూ ఐటెం సాంగ్.. ఈసారి బన్నీతో చిందులేయనుంది ఎవరో తెలుసా.?