Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకు అందిరిపోయే సర్‌ప్రైజ్‌లు.. ఆ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ కూడా..

|

Apr 03, 2024 | 12:43 PM

ఫ్యాన్స్ కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మగధీర సినిమా రి రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా రీరిలీజ్ కానుందని తెలుస్తోంది.

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకు అందిరిపోయే సర్‌ప్రైజ్‌లు.. ఆ సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ కూడా..
Allu Arjun
Follow us on

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన రీ రిలీజ్ ల సందడే కనిపిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. హీరోల బర్త్ డే లకు ఆ హీరోల సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తూ ఉంటారు మేకర్స్. ఇప్పటికే ఇలా చాలా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ సాధించాయి. ఫ్యాన్స్ కూడా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మగధీర సినిమా రి రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సూపర్ హిట్ సినిమా రీరిలీజ్ కానుందని తెలుస్తోంది. మొన్నటి వరకు అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోగా రాణించారు. ఆతర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్.

పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. అలాగే ఇటీవలే అల్లు అర్జున్ మైనపు బొమ్మ ని ఆవిష్కరించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్‌ 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు చేయాలనీ ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా షేక్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు

అలాగే బన్నీ పుట్టిన రోజున అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా రీ రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ జులాయి సినిమా ఇప్పుడు రీ రీరిలీజ్ కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ఏప్రిల్ 8న మరోసారి థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. అంతే కాదు బన్నీ బర్త్ డే రోజు పుష్ప 2 టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ అట్లీ సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలా బన్నీ బర్త్ డే కు వరుస సర్ ప్రైజ్ లు రానున్నాయి. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.