Tillu Square: టిల్లుగాడి సక్సెస్ కోసం ‘దేవర’ ఆగమనం.. సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే..

|

Apr 06, 2024 | 4:17 PM

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ లిల్లీ పాత్రలో నటించింది. అలాగే గతంలో డీజే టిల్లు మూవీలో నటించిన రాధిక.. అలియాస్ నేహాశెట్టి కూడా ఈ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. అప్పుడు రాధిక.. ఇప్పుడు లిల్లీ చేతిలో ఆగమయ్యాడు టిల్లు. మార్చి 29న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Tillu Square: టిల్లుగాడి సక్సెస్ కోసం దేవర ఆగమనం.. సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే..
Ntr, Siddhu
Follow us on

ప్రస్తుతం బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తో్న్న సినిమా టిల్లు స్క్వేర్. దాదాపు రెండు గంటలపాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది ఈ మూవీ. ఎప్పటిలాగే తనదైన మేనరిజం.. డైలాగ్ డెలివరీతో థియేటర్లలో అల్లాడిస్తున్నాడు సిద్ధూ జొన్నలగడ్డ. డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రూ. 100 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ లిల్లీ పాత్రలో నటించింది. అలాగే గతంలో డీజే టిల్లు మూవీలో నటించిన రాధిక.. అలియాస్ నేహాశెట్టి కూడా ఈ మూవీలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. అప్పుడు రాధిక.. ఇప్పుడు లిల్లీ చేతిలో ఆగమయ్యాడు టిల్లు. మార్చి 29న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

విడుదలైన వారం రోజుల్లోనే రూ. 94 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది టిల్లు స్వ్కేర్. ఇక నిన్నటితో ఈ సినిమాకు రూ. 96 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక మరో నాలుగైదు రోజుల్లో టిల్లు స్క్వేర్ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమంటున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా టిల్లు, లిల్లీ కహానీ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో టిల్లు స్క్వేర్ మూవీ టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఇక ఇప్పుడు మరోసారి టిల్లుగాడి సక్సెస్ కోసం రానున్నాడు. ఏప్రిల్ 8న ఈ మూవీ సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సక్సెస్ మీట్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ కూడా షేర్ చేశారు. అయితే ఈ సక్సెస్ మీట్ ఎక్కడ అనేది తెలియరాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.