ఏడాది ప్రారంభం నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఊపందుకుంది. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు పెద్ద సినిమాల సందడి మొదలవనుంది. బడా సినిమాలకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాది అత్యంత భారీ బడ్జెట్ చిత్రం జూన్‌లో విడుదల కానుంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అలాగే మోస్ట్ అవైట్డ్ మూవీస్ లో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా ఒకటి. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇది. కొరటాల శివ ద్సర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవర సినిమా అక్టోబర్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు గట్టి పోటీ ఉండనుంది. జూనియర్ ఎన్టీఆర్‌కి పోటీగా రజినీకాంత్ రంగంలోకి దిగుతున్నారు.
రజనీకాంత్ ప్రస్తుతం తన రాబోయే ప్రాజెక్ట్-కూలీ పనుల్లో బిజీకానున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్‌ను ఇటీవలే ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేయగా, దానికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతకంటే ముందు రజనీకాంత్ సినిమా మరో సినిమా వస్తుంది, ఆ సినిమానే ‘వెట్టయన్’.
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల తేదీని చాలా కాలం క్రితమే ప్రకటించాడు. ‘దేవర’ అక్టోబర్ 10న విడుదల కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని కూడా ఇదే తేదీకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. వేతాయన్ చిత్రాన్ని అక్టోబర్ 10న విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే అధికారికంగా విడుదల తేదీని ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. రజనీకాంత్ సినిమా అక్టోబర్ 10న విడుదలైతే జూనియర్ ఎన్టీఆర్ దేవరకి క్లాష్ రావడం ఖాయం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.