RRR Song Promo: ‘ఆర్ఆర్ఆర్’నుంచి ‘కొమురం భీముడో’ సాంగ్ ప్రోమో.. ఆలపించింది ఎవరో తెలుసా..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్నఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

RRR Song Promo: ఆర్ఆర్ఆర్నుంచి కొమురం భీముడో సాంగ్ ప్రోమో.. ఆలపించింది ఎవరో తెలుసా..
Rrr

Updated on: Dec 23, 2021 | 12:37 PM

Komuram Bheemudo Song: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్నఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‏లో రికార్డ్స్ సునామి సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‏తో డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు జక్కన్న. ఈ క్రమంలో తాజాగా సాంగ్ ప్రోమోను విడుదల చేశారు చిత్రయూనిట్.

కొమురం భీముడో.. కొమురం భీముడో అంటూ సాగే ఈ పాటను కాలభైరవ ఆలపించారు. ఈ పాటకు సాహిత్యాన్ని సుద్దాల అశోక్ తేజ అందించారు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. తారక్ కొమురం భీమ్ గా కనిపించనున్నాడు. కొమురం భీముడో  ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు.  ఎం.ఎం. కీరవాణి సంగీతం , సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Konidela Upasana: ప్రధానమంత్రితో సమావేశమైన మెగా కోడలు.. ఎందుకంటే..

RRR: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

Kamal Haasan: విక్రమ్‌ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే!