గుండె బరువెక్కింది.. పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు.

గుండె బరువెక్కింది.. పహల్గామ్‌ ఉగ్రవాద దాడి పై సెలబ్రెటీల రియాక్షన్
Ntr, Ramcharan

Updated on: Apr 23, 2025 | 7:23 AM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదేనన్నారు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా .

నిన్న ( మంగళవారం)మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్‌ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది పర్యటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. అనంతరం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా.. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రక్తపు మడుగులో పడిఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది.

ఈ ఘటన పై సినీ సెలబ్రెటీలు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. “పహల్గామ్ దాడి బాధితుల గురించి తెలిసి హృదయం ద్రవించిపోయింది . దాడిలో మరణించిన వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా” అని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదిక ట్వీట్ చేశారు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ.. ప‌హ‌ల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధగా అనిపించింది. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండించాలి. ఈ కష్ట సమయాన్ని తట్టుకుని నిలబడే మనోస్థైర్యాన్ని, ధైర్యాన్ని దేవుడు బాధిత కుటుంబాలకు ఇవ్వాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

రామ్ చరణ్ ఎక్స్ పోస్ట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.