Jr.NTR nick name : జూనియర్ ఎన్టీఆర్‏ను ఇంట్లో పిలిచే ముద్దుపేరు ఎంటో తెలుసా ?.. తారక్ అనుకుంటే పొరపాటే..

ఇక తారక్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సత్తా చాటిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Jr.NTR nick name : జూనియర్ ఎన్టీఆర్‏ను ఇంట్లో పిలిచే ముద్దుపేరు ఎంటో తెలుసా ?.. తారక్ అనుకుంటే పొరపాటే..
Jr Ntr

Updated on: Jan 18, 2023 | 10:03 AM

జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తారక్. కేవలం భారతీయులే కాదు.. విదేశాల్లోనూ ఎన్టీఆర్‏కు వీరాభిమానులు ఉన్నారు. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. నటనలో.. ప్రవర్తనలో తారక్ ప్రత్యేకం. తారకరాముడి మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. తక్కువ సమయంలోనే తన అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తారక్ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు లెక్కలేనంత. ఇక తారక్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సత్తా చాటిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తారక్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. అదే ఎన్టీఆర్ ముద్దు పేరు. అభిమానులంతా తారక్ ను యంగ్ టైగర్ అంటూ పిలిచుకుంటారు. అలాగే తారక్ అని కూడా పిలుస్తుంటారు. ఇక సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ కు సినీ ప్రముఖులు.. డైరెక్టర్స్, నిర్మాతలు అందరూ తారక్ అంటూ పిలుస్తారు. కానీ ఇంట్లో ఏం పిలుస్తారో తెలుసా ?. ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా.

ఇవి కూడా చదవండి

గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రమోషన్లలో పాల్గొన్న తారక్ .. తనను ఇంట్లో ఒక్కో పేరుతో పిలుస్తుంటారని చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా ఓ పేరు మాత్రం కాదని అన్నారు. తారక్ మాట్లాడుతూ.. మా ఇంట్లో మా అమ్మగారు ఓ పేరు పెట్టి పిలుస్తారు.. పలుకుతాను.. అలాగే నా భార్య లక్ష్మి ప్రణతి ముద్దుగా ఓ పేరు పెట్టి పిలుస్తుంది పలుకుతాను.. మా పిల్లలు నాన్న అని పిలుస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నా.. తారక్ అన్నా.. రామారావు అన్నా పలుకుతాను. ప్రేమగా ఎలా పిలిచిన పలుకుతాను..ఇలాగే పిలవండి అని మాత్రం చెప్పను.. అని అన్నారు.