Jr.NTR: మరో ఘనత సాధించిన ఎన్టీఆర్.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏకైక హీరో..

|

Dec 22, 2023 | 1:40 PM

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం తారక్ దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

Jr.NTR: మరో ఘనత సాధించిన ఎన్టీఆర్.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏకైక హీరో..
Jr.ntr
Follow us on

జూనియర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ మూవీలో కొమురం భీమ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో విదేశీయులను, హాలీవుడ్ దర్శకులను సైతం ఫిదా చేశారు. ఈ సినిమాతో యంగ్ టైగర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ అందుకున్న తారక్..ఇప్పుడు మరో ఘనతను సాధించారు. 2023లో ఆసియాలోనే టాప్ 50లో నిలిచన నటుల జాబితాను ‘ఏషియన్ వీక్లీ’ మ్యాగజైన్ ప్రకటించింది. అందులో ఎన్టీఆర్ స్థానం దక్కించుకున్నారు. ఈస్టర్న్ ఐ 2023 పేరిట ఈ జాబితాను విడుదల చేయగా.. అందులో ఎన్టీఆర్ 25వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో తారక్ కావడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అలాగే పలువురు బీటౌన్ నటీనటులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

కేవలం ఇదే కాకుండా.. ఇటీవల విడుదలైన అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ ప్రకటించిన 500 మంది అత్యంత ఫేమస్ నటీనటుల జాబితాలోనూ తారక్, రాజమౌళి చోటు దక్కించుకున్నారు. అలాగే పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ మొదటి పేజీలలో మెరిశాడు. అలాగే ఆస్కార్ కమిటీలోనూ స్థానం సంపాదించాడు తారక్. ఇక ఇప్పుడు ఏషియన్ వీక్లీ మ్యాగజైన్ జాబితాలోనూ స్థానం సంపాదించాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం తారక్ దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కొన్నాళ్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.