Simhadri: ఎన్టీఆర్ అభిమానుల మంచి మనసు.. ‘సింహాద్రి’ రీరిలీజ్ కలెక్షన్స్ ఏం చేయనున్నారంటే..

|

Apr 12, 2023 | 7:37 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ చిత్రం సింహాద్రి మూవీని ఆయన అభిమానులే సొంతంగా కొనుగోలు చేసుకుని రీరిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ మూవీ విడుదల చేయగా వచ్చే కలెక్షన్స్ ను తారక్ ఫ్యాన్స్ సంక్షేమం కోసమే వాడతామని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.

Simhadri: ఎన్టీఆర్ అభిమానుల మంచి మనసు.. సింహాద్రి రీరిలీజ్ కలెక్షన్స్ ఏం చేయనున్నారంటే..
Simhadri
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొద్దిరోజులుగా స్టార్ హీరోస్ సినిమాలు రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బర్త్ డేస్.. స్పెషల్ డేస్ అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకు వస్తున్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఆరెంజ్ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటివరకు అభిమానుల కోరిక మేరకే ఈ సినిమాలను నిర్మాతలే రీరిలీజ్ చేశారు. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ చిత్రం సింహాద్రి మూవీని ఆయన అభిమానులే సొంతంగా కొనుగోలు చేసుకుని రీరిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఈ మూవీ విడుదల చేయగా వచ్చే కలెక్షన్స్ ను తారక్ ఫ్యాన్స్ సంక్షేమం కోసమే వాడతామని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో 2003లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ సింహాద్రి సినిమాను ఈ సంవత్సరం మే 20వ తేదీన తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని రీరిలీజ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రెస్ నోట్ ద్వారా మీ అందరికీ ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. సింహాద్రి సినిమాను థర్ట్ పార్టీ దగ్గర ఒక ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసి.. దానిని రీరిలీజ్ చేసి మా అభిమాన హీరో ఎన్టీఆర్ గారి పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకోవాలని సన్నాహాలు చేస్తున్నాము. ఈ రీరిలీజ్ ద్వారా వచ్చే కలెక్షన్స్ అభిమానులకే తిరిగి చేరాలి అనే ఉద్దేశంతో థర్ట్ పార్టీ దగ్గర చిత్రరైట్స్ మేమే కొనుగోలు చేసి రీరిలీజ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని ఎన్టీఆర్ అభిమానులు.. అలాగే స్టేట్ కన్వీనర్స్ అందరము కూడా మాట్లాడుకొని బయటకు వాళ్లకు ఈ రీరిలీజ్ నుంచి వచ్చే వసూళ్లు చేరకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చాము.

ఇవి కూడా చదవండి

ఈ రీరిలీజ్ కలెక్షన్స్ ను ఏ జిల్లాకు ఆ జిల్లాలో కష్టాల్లో ఉన్న తారక్ అభిమానులకు సాయంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ మాట తారక్ గారికి కూడా చెప్పగా.. చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నామని.. ఆయన కూడా ముందుకు వెళ్ళమని చెప్పారు. అభిమానులకు ఎంతో కొంత సాయంగా ఉండటానికే ఈ సినిమా రీరిలీజ్ చేస్తున్నాం. మా స్వలాభం కోసం అయితే కాదు” అంటూ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.రంటే..