Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల సీతారామ శాస్త్రి పార్థివదేహానికి సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ స్టార్స్ సిరివెన్నెల నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మహేష్ బాబు, రానా , నాగార్జున, వెంకటేష్, ఇలా మరెందరో సినిమాతారలు సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. తాజాగా పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు. మరికొద్దిసేపట్లో ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. సిరివెన్నెల నిర్జీవంగా ఉండటాన్ని చూసి మౌనంగా రోదిస్తున్నారు ప్రతి ఒక్కరు. సిరివెన్నెల కుటుంబసభ్యులను తారక్, పవన్ పరామర్శించి దైర్యం చెప్పారు.
తారక్ బరువెక్కిన హృదయంతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కొన్ని కొన్ని సార్లు మన ఆవేదనను, భాదను వ్యక్తపరచడానికి మాటలు రావు. అలాంటి భావాలను ఆ మహానుభావుడు తన కలంతో వ్యక్తపరిచారు. బహుశా ఈ ఆవేదానును ఆయన తన కలంతోనే వ్యక్తపరిస్తే బావుండేదని తారక్ ఎమోషనల్ అయ్యారు. సీతారామ శాస్త్రి గారి కలం ఆగిన..ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన పాటలు, అక్షరాలు, తెలుగు జాతి, తెలుగు భాష బ్రతికున్నంతకాలం చిరస్మరణీయంగా ఆ సాహిత్యం మిగిలిపోతుంది. రాబోయే తరాలకు ఆ సాహిత్యం బంగారు బాటలు వేయాలని అన్నారు . పైనుంచి ఆయన చల్లను చూపు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుడిని కోరుంటున్నానని తారక్ అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ను ఓదారుస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :