
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వార్ 2 సినిమా తర్వాత తారక్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంతులేని ఆసక్తినెలకొంది. పైగా దర్శకుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో భారీ హిట్ అందుకోవడంతో పాటు టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఇక ఇప్పుడు తారక్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానుల్లోను అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా ఎదుచూస్తున్నారు ఫ్యాన్స్. ఎట్టకేలకు తారక్, ప్రశాంత్ నీల్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. సినిమా రిలీజ్ డేట్ తో పాటు టీజర్ ఎప్పుడో కూడా చెప్పేశారు.
ఎన్టీఆర్, నీల్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీని పై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా తారక్ నుంచి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా జూన్ 11 2027లో విడుదల చేయనున్నారు. రిలీజ్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్ షాడో లుక్ అత్యంత పవర్‌ఫుల్‌గా ఉంది. అలాగే ఈ సినిమా గ్లింప్స్‌ను మే 20న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దాంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
కాగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. అలాగే ఈ సినిమాను రూ. 350కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ అదిరిపోయే లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే తారక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తారక్ కు జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
HIS REIGN… HIS SOIL…
JUNE 11, 2027… IT IS…. #NTRNeel pic.twitter.com/ln9Dq4BFZs— Jr NTR (@tarak9999) April 21, 2026