యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్… ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. జనతా గ్యారేజ్ వంటి సక్సెస్‌పుల్ మూవీ తర్వాత వీరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. తాజాగా న్యూఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి తారక్ అభిమానులకు స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమాను వచ్చే ఏడాది 2024లో ఉగాది కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ నటిస్తుందని టాక్.
A man’s fury is the cure for a disease called courage ??#NTR30 in cinemas on April 5th, 2024 ?
Shoot begins next month ?
Happy New Year ❤️@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sreekar_prasad @sabucyril @YuvasudhaArts pic.twitter.com/EleAsoa3JZ
— NTR Arts (@NTRArtsOfficial) January 1, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.