Sarkaru Vaari Paata: మహేష్ సినిమా కోసం అరబిక్ కుత్తు సింగర్.. సర్కారు వారి పాటలో జోనితా గాంధీ వాయిస్..

మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు

Sarkaru Vaari Paata: మహేష్ సినిమా కోసం అరబిక్ కుత్తు సింగర్.. సర్కారు వారి పాటలో జోనితా గాంధీ వాయిస్..
Mahesh Babu

Updated on: Apr 25, 2022 | 4:29 PM

మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. మహేష్ బాబు సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు , టీజర్ సినిమా పై ఓ రేంజ్ లో ఎక్స్పెటెషన్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ మూవీ కోసం తమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తుంది. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ముందుగా వచ్చిన కళావతి పాట సూపర్ సెన్సేషన్ అయ్యింది. ఆతర్వాత వచ్చిన పెన్నీ.. రీసెంట్ గా వచ్చిన టైటిల్ సాంగ్ ట్రేండింగ్ లో కంటిన్యూ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమానుంచి ప్రమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారట..

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.. ఈ క్రమంలోనే ఓ ప్రమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారట. అయితే ఈ పాటను సెన్సేషనల్ సింగర్ జోనితా గాంధీని రంగంలోకి దించనున్నారట తమన్. ఈ అమ్మడు పాడిన పాటలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్‌గా దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాదు గతంలో తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన ‘కిక్ 2’ సినిమాలో ‘నువ్వే నువ్వే’ అనే పాట పాడింది జోనితా గాంధీ. అలాగే  ‘లవ్ స్టోరీ’ చిత్రంలో ‘ఏవో ఏవో కలలే’ అనే పాట పాడింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కోసం జోనితా గాంధీ ఓ అదిరిపోయే పాట ఆలపించనుందని అంటున్నారు. ఇక సర్కారు వారి పాట సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్‌..

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..