చెక్ బౌన్స్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలకు జీవిత రాజశేఖర్(Jeevitha Rajasekhar) క్లారిటీ ఇచ్చారు. నగరి కోర్టులో రెండు నెలలుగా ఈ కేసు నడుస్తోందన్నారు. తనకు సమన్లు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అరెస్ట్ వారెంట్ మాత్రం అందలేదన్నారు. అయినప్పటికీ తమ లాయర్లు కోర్టులో అటెండ్ అయ్యారని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చాక ఎవరు తప్పు చేశారో.. ఎవరిది మోసమో తెలుస్తుందన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదనీ.. ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కోర్టు తీర్పు తర్వాత అన్ని వివరాలు చెప్తామన్నారు జీవిత రాజశేఖర్. తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యంతో పాటు.. తప్పు చేయకపోతే నిలదీసే ధైర్యం కూడా ఉందన్నారామె. అప్పట్లో రాజశేఖర్ హీరోగా విడుదలైన గరుడ వేగ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఆస్తులు తాకట్టుపెట్టి తమ దగ్గర నుంచి 26 కోట్ల రూపాయలు తీసుకున్నారని జోస్టర్ ఫిలిం సభ్యులు చెబుతున్నారు.
తమ దగ్గరికొచ్చి చాలా ఎమోషనల్ అయ్యారనీ.. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ చెప్పడంతో.. ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చామనీ తెలిపారు. ఆ తర్వాతే వారి నిజస్వరూపం తెలిసొచ్చిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మోసానికి సంబంధించి తమ దగ్గర అన్ని ఆధారాలున్నాయంటున్నారు జోస్టర్ ఫిలిం సర్వీస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు, ఎండీ హేమ. తమ దగ్గర తాకట్టుపెట్టిన ఆస్తులను బినామిల పేరుతో మార్చుకుని, మోసం చేశారని.. దానివల్ల తామెంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు జోస్టర్ ఫిలిం సభ్యులు. జీవిత చాలా డేంజరస్ అంటూ.. తీవ్ర ఆరోపణలు చేశారు. మేం దుర్మార్గులమైతే 35 ఏళ్లు ఇండస్ట్రీలో ఉండేవాళ్లం కాదన్నారు. నేను ఎక్కడికీ పారిపోలేదు. మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.. వాటిని కోర్టులో రుజువు చేయాలన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :