Jathi Ratnalu Director: ఉప్పెన హీరో, జాతి రత్నాలు డైరెక్టర్‌.. క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధం..?

Jathi Ratnalu Director: ప్రస్తుతం టాలీవుడ్‌లో 'జాతిరత్నాల' హవా కొనసాగుతోంది. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమాగా..

Jathi Ratnalu Director: ఉప్పెన హీరో, జాతి రత్నాలు డైరెక్టర్‌.. క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధం..?
Jathi Ratnalu Anudeep Uppen

Updated on: Mar 18, 2021 | 3:18 AM

Jathi Ratnalu Director: ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘జాతిరత్నాల’ హవా కొనసాగుతోంది. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రదారులుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్‌ అందుకుంది. ఇక ఈ సినిమాకు మహానటి ఫేమ్‌ నాగ అశ్విన్‌ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ప్రస్తుతం చిత్ర యూనిట్‌ ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి అనుదీప్‌ కేవీ పేరుతో మరో ప్రామిసింగ్‌ డైరెక్టర్‌ దొరికాడు. 2016లో ‘పిట్టగోడ’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న అనుదీప్‌.. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఒక్కసారిగా బడా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక తాజాగా ఫిలింనగర్‌ సర్కిల్‌లో జరుగుతోన్న ఓ చర్చ ప్రకారం.. అనుదీప్‌ తన తర్వాతి చిత్రాన్ని మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌తో తీయనున్నట్లు తెలుస్తోంది. తొలి సినిమా ‘ఉప్పెన’తోనే సంచలన విజయం సాధించిన వైష్ణవ్‌… ‘జాతి రత్నాలు’తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న అనుదీప్‌తో చేతులు కలపనున్నాడనే వార్తే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అంతేకాదు నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం అనుదీప్‌ అడ్వాన్స్‌గా కొంత మొత్తం కూడా అందజేశాడని టాక్‌. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇదిలా ఉంటే వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read: Nabha Natesh: అక్కినేని హీరోతో జతకట్టనున్న ఈస్మార్ట్‌ బ్యూటీ..? ఈ సినిమాతోనైనా ట్రాక్‌ ఎక్కేనా..

Vakeel Saab Review: సినిమా బ్లాక్ బస్టర్, పవన్ ఈజ్ బ్యాక్… ఫస్ట్ రివ్యూ చెప్పేసిన ఆ క్రిటిక్