Game Changer: ‘గేమ్ ఛేంజర్’ చూసిన జానీ మాస్టర్ కుమారుడు.. రామ్ చరణ్ గురించి ఏం చెప్పాడంటే? వీడియో

|

Jan 14, 2025 | 11:36 AM

గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది. పలువురు ప్రముఖులు కూడా గేమ్ ఛేంజర్ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Game Changer: ‘గేమ్ ఛేంజర్’ చూసిన జానీ మాస్టర్ కుమారుడు.. రామ్ చరణ్ గురించి ఏం చెప్పాడంటే? వీడియో
Game Changer
Follow us on

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర శంకర్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం గేమ్ ఛేంజర్. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అంజలి మరో హీరోయిన్ గా యాక్ట్ చేయగా, ఎస్ జే సూర్య విలన్ గా అదరగొట్టాడు. శ్రీకాంత్, సునీల్, బ్రహ్మానందం, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల వంటి స్టార్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టుతోంది. రామ్ చరణ్ సినిమా కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డులు కొల్లగొట్టింది. ఓ ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగిన పోరాటాన్ని సామాజిక సందేశంతో తెరకెక్కించారు శంకర్. దీంతో ఈ సినిమా పలువురి ప్రశంసలు అందుకుంటుంది. అలాగే రామ్ చరణ్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో ధోప్ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. తాజాగా అతను రామ్ చరణ్ సినిమాను ఫ్యామిలీతో కలిసి వీక్షించాడు. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా గురించి జానీ మాస్టర్ ఇలా చెప్పుకొచ్చాడు.

 

ఇవి కూడా చదవండి

“చదువుతో పాటు సమాజంలో జరిగే విషయాలను గేమ్ ఛేంజర్ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. కొంత మంది రాజకీయ నాయకులు తమ సొంత లాభం కోసం ప్రజలకు సేవ చేయకుండా సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా హీరో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. సొంతగా ఒక పార్టీని స్థాపించి.. డబ్బులు పంచకుండా న్యాయంగా పనిచేస్తాడు. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుందని ఈ సినిమాలో చక్కగా చూపించారు. ఇందులో రామ్ చరణ్ కు కోపంఎక్కువగా ఉంటుంది. కానీ ఆ కోపం కూడా న్యాయంగా కనిపిస్తుంది. ఒక సాధారణ వ్యక్తి కోపాన్ని ఎవరూ పట్టించుకోరని.. అదే ఒక అడ్మినిస్ట్రేషన్ లో చూపించే కోపానికి సరైన రైట్ ఉంటుందని మనకి ఈ గేమ్ ఛేంజర్ సినిమా చెబుతుంది’ అని చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్.

ఈ వీడియోను జానీ మాస్టర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా అది కాస్తా వైరలవుతోంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.