లైంగిక ఆరోపణల కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు జానీ మాస్టర్. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. పోక్సో కేసుకు కారణంగా జాతీయ అవార్డు నిలిచిపోయింది. అలాగే పుష్ప 2 సినిమా ఛాన్స్ కూడా దూరమైంది. అయితే ఇప్పుడు కొరియోగ్రాఫర్ గా మళ్లీ బిజీ అయ్యేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు జానీ మాస్టర్. తన టీంతో కలిసి మళ్లీ డాన్స్ స్టూడియోలో డాన్స్ రిహర్సల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాగా బాలీవుడ్ హీరో వరుణ ధావన్ హీరోగా నటించిన బేబీ జాన్ సినిమాలోని స్పెషల్ సాంగ్ కు జానీ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు సమాచారం. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ లోని ఓ పాటకు కూడా జానీ కొరియోగ్రాఫీ అందించాడు. ఈ పాట నెక్ట్స్ లెవెల్లో ప్లాన్ ఉంటుందని, ఇదొక కొత్త ప్రయోగం చేశామని, ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవ్వరూ చేయలేదని జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు వైవీఎస్ చౌదరిని జానీ మాస్టర్ కలవడం, సరదాగా ఫొటోల దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వైవీఎస్ జానకీ రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో వైవీఎస్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా పాటలు జానీ మాస్టర్ కంపోజ్ చేయనున్నాడా? అని చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా దర్శకుడు వైవీఎస్ చౌదరితో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు జానీ మాస్టర్ .. ‘చాలా రోజుల తర్వాత జెమ్ లాంటి పర్సన్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి గారిని కలిసాను. నా కెరీర్ ప్రారంభంలో ఆయన ఇచ్చిన సపోర్ట్ ను నేనెప్పుడూ మర్చిపోలేను. ఆయన మాటలు నాకు మళ్లీ అపారమైన శక్తిని ఇచ్చాయి. తెలుగులో డాన్స్ మాస్టర్లకు మంచి అవకాశాలు ఇచ్చి, ఎదగడానికి సహాయం చేసిన అతి కొద్ది మంది దర్శకులలో వైవీఎస్ గారు కూడా కూడా ఒకరు. ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ జానీ మాస్టర్ రాసుకొచ్చారు.
Met this gem of a person, director @helloyvs garu after a long time. Just like the beginning days of my career, his words of support gave immense strength to us again. He’s one of the few directors who constantly helped Telugu Dance masters to grow with opportunities.
Wishing a… pic.twitter.com/renmHwh9r9
— Jani Master (@AlwaysJani) December 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.