Jani Master: ‘త్వరలోనే అంతా తెలుస్తుంది’.. జైలు నుంచి బయటకు వచ్చాక జానీ మాస్టర్ మొదటి స్పీచ్.. వీడియో

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి విడుదలయ్యాక బయట పెద్దగా కనిపించలేదు. తాజాగా తొలిసారిగా ఓ సినిమా ఈవెంట్ లో కనిపించాడీ స్టార్ కొరియోగ్రాఫర్.

Jani Master: త్వరలోనే అంతా తెలుస్తుంది.. జైలు నుంచి బయటకు వచ్చాక జానీ మాస్టర్ మొదటి స్పీచ్.. వీడియో
Jani Master

Updated on: Nov 18, 2024 | 10:41 PM

ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు జానీ మాస్టర్. ఈ కేసులో అరెస్టైన అతను 37 రోజులు జైలు జీవితం కూడా గడిపాడు. ఆ తర్వాత కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చాక ఎక్కువగా తన కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నాడీ స్టార్ కొరియోగ్రాఫర్. బయట ఎలాంటి కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. అయితే చాలా రోజుల తర్వాత ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు జాని. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తోన్న కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ ) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు. అతనితో పాటు మాజీ మంత్రి రోజా, శివ బాలాజీ తదితర సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భార్య, కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ‘ ఈ కష్ట కాలంలో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. సాధారణంగా ఇలాంటి టఫ్ సిట్యూయేషన్స్ వస్తే ఎవ్వరూ కనిపించరు. కానీ నన్ను నమ్మి మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించారు. నాపై నమ్మకముంచారు.ఆ నమ్మకం ఉంటుంది. త్వరలోనే అది తెలుస్తుంది.

‘ఇక జబర్దస్త్ రాకేష్ చాలా మంచి వ్యక్తి. నేను జబర్దస్త్ షోకి వెళ్లినప్పుడు అతనిని దగ్గర నుంచి చూశాను. చాలా కష్టపడి పైకి వచ్చాడు. ఎవరి గురించి నెగెటివ్ గా మాట్లాడడు. ఈ వైబ్ చూస్తుంటే కేసీఆర్ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్.

జానీ మాస్టర్ ఫుల్ స్పీచ్ ఈ కింది వీడియోలో చూడొచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us