
ఇటీవల కొద్దిరోజులుగా సోషల్ మీడియా ప్రపంచంలో పలువురు సెలబ్రెటీస్ తరచూ ఫేక్ అకౌంట్స్ భారీన పడుతున్నారు. ఓవైపు డీప్ ఫేక్ వీడియోస్.. మరోవైపు నకిలీ ఖాతాలకు సినీతారలు టార్గెట్‌గా మారుతున్నారు. ఇటీవలే రష్మిక, అలియా భట్ డీప్ ఫేక్ బాధితులు కాగా.. ఇప్పుడు హీరోయిన్ జాన్వీ కపూర్ కు మరో సమస్య వచ్చింది. నెట్టింట జాన్వీ చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇన్ స్టాలో నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ సందడి చేస్తుంది. అయితే తాజాగా ఆమె పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో ఉన్నట్లుండి అశ్లీల చిత్రాలు కనిపించాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. జాన్వీ ఖాతాలో ఇలాంటి ఫోటోస్ ఏంటీ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వెంటనే జాన్వీ పర్సనల్ అలర్ట్ అవుతూ దీనిపై క్లారిటీ ఇచ్చింది. జాన్వీకి అసలు ఎక్స్ అకౌంట్ లేదని.. ఆమె పేరుతో ఉన్న ఫ్యాన్ అకౌంట్ ద్వారా ఫోటోస్ షేర్ అయినట్లు తెలిపారు.
దీంతో జాన్వీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాన్వీ కపూర్ ప్రతినిధి సూచించారు. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో ఎవరీ పేరుతోనైనా ఖాతాలను సృష్టంచడం చాలా సులభమని.. జాన్వీ కపూర్ కు ఎక్స్ లో ఎలాంటి అధికారిక ఖాతా లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్ అకౌంట్స్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. అలాగే అలాంటి నకిలీ ఖాతాల జోలికి వెళ్లొద్దని కోరారు.
ఇదిలా ఉంటే జాన్వీ చివరిగా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో కనిపించింది. ఇందులో నటుడు రాజ్‌కుమార్ రావు కూడా నటించారు. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ డాక్టర్ మహిమగా నటించింది. ఆమె భర్త మహేంద్ర కోసం క్రికెటర్‌గా మారుతుంది. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ వచ్చింది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో నటిస్తుంది. అలాగే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో నటించనుంది. అలాగే వరుణ్ ధావన్ సరసన తులసి కుమారి చిత్రంలో నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.