దివంగత సీనియర్ హీరోయిన్ శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ కపూర్. మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ మూవీతో ప్రేక్షకుల మందుకు వచ్చింది. అయితే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి కొద్ది రోజులుగా రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ముందు మాస్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం కానుందని టాక్ నడిచింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తోన్న మూవీలో కథానాయికగా జాన్వీ నటిస్తుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలు నిజం కావాలని అంటుంది ఈ అమ్మడు. తనకు తారక్ సినిమాలో నటించాలని ఉందని మనసులోని మాటను చెప్పేసింది. అలాగే తనకు టాలీవుడ్ హీరోస్ అందరూ ఇష్టమంటూ చెప్పుకొచ్చింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న జాన్వీ.. తనకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోలందరూ ఇష్టమైనవారని చెప్పింది. దక్షిణాది నటులతో కలిసి పనిచేస్తారా ? అని అడుగుతూ.. ఎన్టీఆర్ సినిమా గురించి నెట్టింట ప్రచారమవుతున్న రూమర్ గురించి ప్రశ్నించారు. ” ఆ వార్తలు నిజం కావాలని కోరుకుంటున్నాను. నిజంగానే నాకు ఎన్టీఆర్ తో కలిసి పనిచేయాలని ఉంది. అలాగే తెలుగు హీరోలందరి సినిమాల్లో నటించాలని ఉంది” అని తెలిపింది. ఇక ఇటీవలే తాను ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చూశానని.. అందులో తారక్, చరణ్ నటన అద్బుతమంటూ ప్రశంసలు కురిపించింది.
ప్రస్తుతం ఆమె చేతిలో మిలీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన మిలీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. మొత్తానికి తనకు తారక్ సినిమాలో నటించాలని ఉందని.. టాలీవుడ్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు మనసులోని మాటలను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.