బుల్లితెర నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష.. ఏం జరిగిందంటే?

Big Boss fame LoBo convicted and jailed for one year: బిగ్ బాస్ ఐదో సీజన్ షోలో అలరించిన లోబో.. పలు టీవీ కార్యక్రమాలు, సినిమాల్లోనూ నటించారు. ఇక లోబో తన వెరైటీ గెటస్‌, పేరు, మాటలతో ప్రేక్షకులకు అనతి కాలంలోనే గుర్తుండిపోయాడు. అయితే లోబో కొన్నేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరి మృతితోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి..

బుల్లితెర నటుడు లోబోకు ఏడాది జైలు శిక్ష.. ఏం జరిగిందంటే?
Big Boss Fame Lobo

Updated on: Aug 29, 2025 | 8:17 AM

బిగ్‌బాస్‌ లోబో గురించి తెలియని వారుండరు. బిగ్ బాస్ ఐదో సీజన్ షోలో అలరించిన లోబో.. పలు టీవీ కార్యక్రమాలు, సినిమాల్లోనూ నటించారు. ఇక లోబో తన వెరైటీ గెటస్‌, పేరు, మాటలతో ప్రేక్షకులకు అనతి కాలంలోనే గుర్తుండిపోయాడు. అయితే లోబో కొన్నేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరి మృతితోపాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నటుడు లోబో అలియాస్‌ ఖయూమ్‌ అలియాస్‌ లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. అసలేం జరిగిందంటే..

2018 మే 21న ఓ టీవీ ఛానల్‌ తరఫున వీడియో చిత్రీకరణ కోసం లోబో టీం రామప్ప, లక్నవరం, భద్రకాళి చెరువు, వేయిస్తంభాల ఆలయం వంటి ప్రాంతాల్లో షూటింగ్‌ చిత్రీకరించారు. అనంతరం లోబో టీం సభ్యులందరూ కలిసి కారులో వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరాడు. ఈ కారును లోబో డ్రైవ్‌ చేశాడు. వీరి కారు రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఖిలాషాపురం గ్రామానికి చెందిన మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలోని ఇతర ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఇక లోబో ప్రయాణిస్తున్న కారు సైతం బోల్తా పడింది. లోబోతో పాటు కారులోని ఇతర టీం సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న రఘునాథపల్లి పోలీసులు లోబోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఏడు సంవత్సరాల విచారణ తర్వాత దీనిపై తాజాగా జనగామ కోర్టు తీర్పు వెలువరించింది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చింది. అలాగే రూ.12,500 జరిమానా కూడా విధించినట్లు జనగామ జిల్లా రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై నరేష్‌లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.