Pawan Kalyan: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ కల్యాణ్ భరోసా.. భారీ ఆర్థిక సాయం ప్రకటన

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మరోసారి నివాళులు అర్పించిన ఆయన మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. అంతేకాదు ఆ కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Pawan Kalyan: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు వాసికి పవన్ కల్యాణ్ భరోసా.. భారీ ఆర్థిక సాయం ప్రకటన
Pawan Kalyan

Updated on: Apr 29, 2025 | 12:59 PM

జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడిలో మొత్తం 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వేసవి సెలవుల్లో విహార యాత్ర కోసం వెళ్లిన వారిపై ఉగ్రదాడులు భీకర కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో మొత్తం 28 మంది పర్యాటకులు అమరులయ్యారు. ఇందులో ఇద్దరు ఏపీ వాసులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులైన వారికి నివాళుర్పించేందుకు జనసేన పార్టీ మంగళగిరిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరై ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇదే సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున భారీ ఆర్థికసాయం ప్రకటించారు పవన్ కల్యాణ్. పార్టీ క్రియాశీలక సభ్యుడు అయిన మధుసూదన్ కుటుంబానికి రూ. 50 లక్షల సాయం ప్రకటించారు. మధుసూదన్ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చిన ఆదుకుంటామని భరోసా ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.

‘గతంలో పలుమార్లు పాకిస్తాన్ ను ఓడించినా వారి బుద్ధి మారడం లేదన్నారు. మనం మత సామరస్యం పాటిస్తూ, లౌకిక దేశంగా ఉంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ మాత్రం ప్రజల మతం అడిగి మరీ కాల్పులు జరిపి హత్యలు చేయడం దారుణం. ఉగ్రదాడుల్లో నెల్లూరు జిల్లా కావలికి చెందిన జనసేన కార్యకర్తను కోల్పోయాం. ఏపీకి చెందిన చంద్రమౌళి, నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ సైతం ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మధుసూదన్ కుటుంబానికి జనసేన అండగా ఉంటుంది. వారితో పాటు ఈ ఉగ్ర దాడిలో అమరులైన వారికి జనసేన పార్టీ నివాళులు అర్పిస్తోంది. అని పవన్ కల్యాణ్‌ సభలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.