నందమూరి తారకరామారావు నటవారసుడిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు బాలకృష్ణ. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే నటవారసులలో టాప్ హీరో అనిపించుకున్న తొలి కథానాయకుడు. ఆయన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, సూపర్ హిట్స్ చిత్రాలున్నాయి. 1984లో డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు సినిమా హీరోగా టర్న్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన చిత్రాలన్ని సూపర్ హిట్ అయ్యాయి. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈరోజు (జూన్ 10న) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
బాలయ్య బర్త్ డే సందర్భంగా.. ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టేలా.. సింగర్ నోయల్ సేన్ ఓ ర్యాప్ సాంగ్ తీర్చిదిద్దాడు. బాలయ్య పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ పాటను యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. నోయల్ స్వయంగా రాసి ఆలపించిన ఈ పాటకు ప్రదీప్ సాగర్ స్వరాలు సమకూర్చాడు. “నందమూరి సింహం వచ్చే సూడు.. “అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంటుంది. తాజాగా ఈపాట విన్న అభిమానులు జై బాలయ్య అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే .. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో కాజల్, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ఈరోజు బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.