ఏలూరు: గోదారోళ్ల మర్యాదలు ఎంత చెప్పినా తక్కువే. అతిధి సత్కారాలకు ఎపుడూ ఏ లోటు రానివ్వరు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బంధువులు ఎవరైనా , ఎవరినైనా ఇంటికి పిలిచినా , వచ్చినా భోజనం చేయకుండా..చేయి కడగకుండా మాత్రం వెళ్ల నివ్వరు. అందుకే గోదారిళ్లు పెట్టి చంపుతారంటారు తమాషాకి. తాజాగా సినీ నటుడు జగపతిబాబు కి ఇదే అనుభవం ఎదురైంది. షూటింగ్ కోసం పశ్చిమగోదావరి జిల్లా కు వచ్చిన ఆయనకు ఓ రాజుగారు భోజనాలు పంపారు. భోజనం అంటే సాదా సీదా కాదు మరి..నాన్ వెజ్ లో అన్ని రకాల వంటల వెరైటీలు వడ్డించారు. ఇక ఆ ఐటెం లు చూడగానే జగపతిబాబు చలించిపోయారు. ఓం వీడియో తీసి మరి విడుదల చేశారు.
గోదావరి జిల్లా భీమవరంలో అతిధి మర్యాదలు, భోజనంలో వడ్డించే వంటకాల వీడియోను సినీ నటుడు జగపతిబాబు పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాలలో జరిగే షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన జగపతిబాబుకు భీమవరంలో ఒక రాజుగారు ఇంట్లో అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు. రకరకాల నాన్ వెజ్ వంటకాలను జగపతిబాబుకు పంపించారు. తనకు వడ్డించే భోజనంలో రకాలను చూసి జగపతిబాబు షాక్ అయ్యారు.
ఆ వంటకాలను వీడియో చూపిస్తూ బకాసురుడిలా భోజనం చేసి, కుంభకర్ణుడిలా పడుకున్నానని, జై భీమవరం, జై రాజులు, జై ప్రభాస్ అంటూ వీడియో పోస్ట్ చేయడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు జగపతిబాబు. త్వరలో భీమవరంలో జరిగే షూటింగ్ లో పాల్గొననున్నారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.