Jagapathi Babu: ప్రకృతి ప్రేమికుడిగా జగపతి బాబు.. ఆకట్టుకుంటున్న సింబా మూవీ పోస్టర్

|

Jun 05, 2022 | 2:56 PM

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ సింబా. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు సంపత్ నంది..

Jagapathi Babu: ప్రకృతి ప్రేమికుడిగా జగపతి బాబు.. ఆకట్టుకుంటున్న సింబా మూవీ పోస్టర్
Jagapathi Babu
Follow us on

సంపత్ నంది(Sampath Nandi )దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ సింబా. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు సంపత్ నంది.. ఈ క్రమంలోనే ఇప్పుడు సరి కొత్త కథతో సింబా మూవీని రూపొందిస్తున్నాడు. అరణ్యం నేపథ్యంలో అల్లుకున్న కథతో సింబా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లింగ్‌ సబ్జెక్ట్ కు రచయితగా వ్యవహరిస్తున్నాడు సంపత్‌నంది. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముర‌ళీ మోహ‌న్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సంప‌త్ నంది, రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. వెర్సటైల్‌ యాక్టర్‌ జగపతిబాబు ‘సింబా’లో ప్రకృతి ప్రేమికుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌లో జగపతిబాబు భుజాలమీద చెట్టును మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ”ప్రకృతి తనయుడు ఇతడు.. జగపతిబాబు గారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. వరల్డ్ ఎన్విరాన్‌మెంట్‌ డే సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్‌ సింబాను పరిచయం చేస్తున్నాం” అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇక సింబాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. డి.కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తోన్న సింబా చిత్రానికి కృష్ణప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి