Jabardasth: జబర్దస్త్‌లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్ ఇస్తాడు.. బిర్యానీ పెట్టి మరీ..

జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో గణపతి ఒకరు. ఎత్తుగా, బొద్దుగా ఉండే ఆయన ఎక్కువగా లేడీ గెటప్పులు వేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను నవ్వించారు. అయితే ప్రస్తుతం ఈ టీవీషోకు దూరంగా ఉంటోన్న గణపతి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Jabardasth: జబర్దస్త్‌లో ఆ టీమ్ లీడర్‌ చాలా గ్రేట్.. స్కిట్ కాగానే చెక్ ఇస్తాడు.. బిర్యానీ పెట్టి మరీ..
Jabardasth Ganapathi Master

Updated on: May 20, 2026 | 5:12 PM

వృత్తి పరంగా టీచర్ అయిన కమెడియన్ గణపతికి నటన అంటే చాలా ఇష్టం. అందుకే నటనపై మక్కువతో శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చి ఆఫీస్‌ల చుట్టూ తిరిగాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు వేశాడు. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కువగా లేడీ గెటప్పులు వేస్తూ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. మొదట షకలక శంకర్ టీమ్ లో చేసిన గణపతి ఆ తర్వాత అదిరే అభి, హైపర్ ఆది టీమ్స్ లో చేశాడు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన గణపతి జబర్దస్త్ టీమ్ లీడర్స్, తన మొదటి రెమ్యునరేషన్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘నేను కూడా ఆర్టిస్ట్ అవుదామని హైదరాబాద్ కు వెళ్లాను. అక్కడ అమన్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయన షార్ట్ ఫిల్మ్‌లో లావుగా ఉండే పోలీస్ కోసం వెతుకుతున్నారట.. ఆ విషయం నాకు చెప్పడంతో అందులో నేను నటించా. ఆ తరువాత ఆయనే.. లవ్ యూ బంగారం సినిమా షూటింగ్‌లో నన్ను తసుకున్నారు. ఆ తరువాత షకలక శంకర్‌తో కలిసి జబర్దస్త్‌లో చేసే అవకాశం వచ్చింది. షకలక శంకర్ టీం లీడర్ కావడంతో నాకు కంటెస్టెంట్‌గా ఆఫర్ ఇచ్చాడు. 2013 నుంచి 15 వరకూ షకలక శంకర్‌తోనే కలిసి పనిచేశాను. అయితే 2015లో షకలక శంకర్ వెళ్లిపోయారు. అయితే నాకు డబ్బులు బాగా అవసరం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అదిరే అభి దగ్గరకు వెళ్లాను. ఆయన స్కిట్ కాగానే సాయంత్రానికే చెక్ ఇస్తాడు. పైగా బిర్యానీ కూడా పెడతాడు. హైపర్ ఆది నా గురించి అభికి చెప్పడంతో నాకు డైలాగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమన్నారు. స్కిట్ లో నేను బాగా చేయడంతో ఆ రోజు సాయంత్రానికే అభి చెక్ ఇచ్చాడు. ఆది లేకపోతే నాకు జబర్దస్త్ అవకాశం వచ్చేది కాదు. జబర్దస్త్ స్టేజ్ మీద చేయడం గొప్ప అనుభూతి. ఈ షోలో నా తొలి పారితోషికం వెయ్యి రూపాయిలు’ అని చెప్పుకొచ్చారు గణపతి.

ఇవి కూడా చదవండి

టీచర్స్ డే వేడుకల్లో గణపతి మాస్టర్.. వీడియో..

జబర్దస్త్ లోనే కాదు పలు సినిమాల్లో కూడా కమెడియన్‌గా నటించి మెప్పించారు గణపతి మాస్టర్. అయితే ఇప్పుడాయన తన సొంత జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని ఓ గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 1998లో డీఎస్సీలో ఎంపికైన కొందరు అభ్యర్థులకు 2023లో ప్రభుత్వం పోస్టింగ్ లు కేటాయించిన సంగతి తెలిసిందే. అందులో జబర్దస్త్ గణపతి కూడా ఉన్నారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us