
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు పడి సక్సెస్ అయినా వారే.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు అనుభవించింది ఆ తర్వాత అవకాశాలు అందుకొని సక్సెస్ అయ్యారు. తాజాగా ఓ నటుడు కూడా తన జీవితంలో పడిన కష్టాలను గుర్తుచేసుకున్నాడు. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. నిజం చెప్పాలంటే ఈ షో ద్వారా చాలా మంది జీవితం మారిపోయింది. కొంతమంది సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్ అవకాశం రాక ముందు చాలా మంది ఎన్నో కష్టాలను చూశారు. కొంతమంది తినడానికి కూడా తిండి లేక ఇబ్బందులు పడ్డామని కూడా చెప్పారు. తాజాగా ఓ జబర్దస్త్ నటుడు తన కష్టాలను గుర్తు చేసుకొని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నాడు.
చదువు కుంటూనే పనులకు వెళ్లాను .. ఏడు నెలలు తాపీ పనికి వెళ్లాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జబర్దస్త్ నటుడు. అతను ఎవరో కాదు ఇమ్మానుయేల్. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఇమ్మానుయేల్ జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. జబర్దస్త్ తర్వాత ఇప్పుడు కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో పాల్గొంటున్నాడు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇమ్మానుయేల్ తన కష్టాలను గుర్తు చేసుకున్నాడు. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మానుయేల్.
ఈ ప్రోమోలో ఇమ్మాన్యూల్ మాట్లాడుతూ..” నాకు మా ఊరంటే చాలా చాలా ఇష్టం.. మా ఊరి పేరు వైకుంఠపురం.. నా డిగ్రీ అయిపోయిన తర్వాత దాదాపు నేను ఒక ఏడు నెలలు తాపీ పనికి వెళ్లాను.. బొచ్చలు మోయడానికి వెళ్ళాను .. సిమెంట్ బొచ్చలు మోయడం వల్ల.. వేళ్లన్ని బొక్కలు పడితే ఏడ్చేసేవాడ్ని మా అమ్మ దగ్గర.. వర్షం పడితే నన్ను మా అన్నని పడుకోబెట్టి మా అమ్మనాన్న.. గోనె సంచులు పట్టుకొని కూర్చునేవాళ్లు.. మాకు ఎవరూ హెల్ప్ చేయలేదు.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇమ్మాన్యూల్. ఇమ్మాన్యూల్ మాట్లాడుతుంటే అక్కడ ఉన్నవారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీముఖి ఇమ్మాన్యూల్ దగ్గరకు తీసుకొని ఓదార్చింది ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.