Punch Prasad: నా భార్య లేకపోతే ఐదేళ్ల క్రితమే చనిపోయేవాడిని.. కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌ ఎమోషనల్‌

జబర్దస్త్‌ షోలో తనదైన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు పంచ్‌ ప్రసాద్‌. తన సెన్సాఫ్‌ హ్యూమర్‌ అండ్‌ ట్యాలెంట్‌తో అందరినీ నవ్విస్తోన్నఈ కమెడియన్‌ నిజ జీవితంలో మాత్రం ఆ నవ్వులు లేకుండా పోతున్నాయి. నిత్యం కష్టాలు, కన్నీళ్లతో వార్తల్లో నిలుస్తున్నాడు ప్రసాద్‌.

Punch Prasad: నా భార్య లేకపోతే ఐదేళ్ల క్రితమే చనిపోయేవాడిని.. కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌ ఎమోషనల్‌
Punch Prasad Family

Updated on: Jun 08, 2023 | 6:05 AM

జబర్దస్త్‌ షోలో తనదైన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు పంచ్‌ ప్రసాద్‌. తన సెన్సాఫ్‌ హ్యూమర్‌ అండ్‌ ట్యాలెంట్‌తో అందరినీ నవ్విస్తోన్నఈ కమెడియన్‌ నిజ జీవితంలో మాత్రం ఆ నవ్వులు లేకుండా పోతున్నాయి. నిత్యం కష్టాలు, కన్నీళ్లతో వార్తల్లో నిలుస్తున్నాడు ప్రసాద్‌. గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న అతని పరిస్థితి ఇటీవల మరింత విషమించింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రసాద్ కున్న ధైర్యం, భరోసా ఒక్కటే.. అతని భార్య సునీత. కిడ్నీల సమస్యల ఉందని తెలిసినప్పటికీ అతనితో కలిసి జీవితం పంచుకునేందుకు సిద్ధమైన సునీత గొప్పతనం గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు ప్రసాద్‌. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన ఈ జబర్దస్త్ కమెడియన్ మరోసారి తన సతీమణిపై ప్రశంసల వర్షం కురిపించాడు. తన భార్య లేకపోతే ఐదేళ్ల క్రితమే చనిపోయేవాడినంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

 

‘ నాకు లెగ్ ఇన్ఫ్‌క్షన్, పారా థైరాయిడ్ సమస్యలతో రక్తం కూడా తక్కువ ఉంది. అయినప్పటికి ఆపరేషన్ చేస్తే కొంతమందికి సక్సెస్ అవుతుందని.. మరికొంతమందికి సక్సెస్ కాదన్నారు. అందుకే ఆపరేషన్ చేస్తా అంటే నేను భయపడ్డాను. ఇంకా ముఖ్యంగా నా పిల్లల కోసం ఆలోచించి సర్జరీ ఆలస్యం చేశాను. నా శరీరం బలంగా ఉన్నప్పుడే సర్జరీ చేయించుకుంటే చాలా మంచిదని డాక్టర్లు చెప్పారు. నాకు ఎక్కువగా నా పిల్లల్ని చూస్తే బాగా ఏడుపొస్తుంది. అయితే నాకంటే నా భార్యే పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. ఆమె లేకపోతే 5 ఏళ్ల క్రితమే నేను చనిపోయేవాడిని ‘ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు ప్రసాద్‌. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ కమెడియన్‌ త్వరగా కోలుకోవాలంటూ అందరూ ఆకాంక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..