Chalaki Chanti: జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి గుండె పోటు

జబర్దస్త్ షోలో కామెడీ చేసి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు చంటి. బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా మంచి పాత్రల్లో అతడు నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంటికి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలిసింది.

Chalaki Chanti: జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి గుండె పోటు
Comedian Chalaki Chanti
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2023 | 12:35 PM

జబర్దస్త్ కమెడియన్ చలాకి చంటి గుండె పోటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురయిన చంటిని ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం చంటికి డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి పాపులారిటీ సంపాందించిన చంటి.. ఆ తర్వాతి కాలంలో కూడా పలు సినిమాల్లో నటించాడు. ఆపై జబర్ధస్త్ షోలో కమెడియన్‌గా చాలాకాలం పాటు రాణించాడు. అక్కడైన తనదైన కామెడీ టైమింగ్, పంచ్‌లతో అలరించాడు. జబర్ధస్త్ షో చేస్తూనే సినిమాల్లో కూడా నటించాడు. ఈటీవీ ప్లస్‌లో నా షో నా ఇష్టం షోకు హోస్ట్‌గా చేశాడు. ఈ కార్యక్రమం చాలాకాలం కొనసాగింది.

చంటి  బిగ్‌బాస్‌ సీజన్‌-6 కంటెస్టెంట్‌గా వెళ్లినప్పుడు .. హౌస్‌లో గీతు రాయల్‌తో గట్టిగా పలుమార్లు వాగ్వాదం జరిగింది. ఎందుకో ఏమైందో తెలియదు కానీ.. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చాక అటు సినిమాల్లో కానీ.. ఇటు టీవీ షోలలో కానీ పెద్దగా కనిపించలేదు చంటి.  ఎప్పుడు తన చలాకీతనంతో అందరినీ నవ్వించే చంటి ఇలా చిన్న వయస్సులో గుండెపోటుకు గురయ్యాడని తెలియడంతో.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.