కోఠీలో స్కూల్‌ బ్యాగ్స్‌ అమ్మా.. హోటల్‌లో గిన్నెలు కడిగా.. కొమరం నవ్వుల వెనక ఇన్ని కన్నీటి కష్టాలున్నాయా?

|

Apr 02, 2023 | 5:50 AM

సినిమాల్లో తమ కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల వెనక ఎవరికీ తెలియని కన్నీటి కష్టాలుంటాయి. అందరూ గోల్డెన్‌స్పూన్‌తో పుట్టరు కదా.. అందుకే ఎన్నో కష్టాల కడలిని దాటితే కానీ తమ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టలేరు...

కోఠీలో స్కూల్‌ బ్యాగ్స్‌ అమ్మా.. హోటల్‌లో గిన్నెలు కడిగా.. కొమరం నవ్వుల వెనక ఇన్ని కన్నీటి కష్టాలున్నాయా?
Comedian Komaram
Follow us on

సినిమాల్లో తమ కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించే కమెడియన్ల వెనక ఎవరికీ తెలియని కన్నీటి కష్టాలుంటాయి. అందరూ గోల్డెన్‌స్పూన్‌తో పుట్టరు కదా.. అందుకే ఎన్నో కష్టాల కడలిని దాటితే కానీ తమ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టలేరు. ప్రస్తుతం మనల్ని నవ్విస్తోన్న కమెడియన్లలో చాలామంది ఇలా వచ్చి గుర్తింపు తెచ్చుకున్నవారే. అందులో జబర్దస్త్ ఫేం కమెడియన్‌ కొమరం అలియాస్‌ కొమరక్క కూడా ఒకరు. తన కామెడీ పంచులతో అదరగొట్టే కొమరం ‘పశువులంటే ప్రాణం’ అనే ట్రేడ్‌మార్క్‌ డైలాగ్‌తో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన వాయిస్‌ మ్యాడ్యులేషన్‌, వేష ధారణతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించిన కొమరం ఇప్పుడిప్పుడే వెండితెరపై కూడా మెరుస్తున్నాడు. అలా తాజాగా నాని, కీర్తి సురేశ్‌ల దసరా చిత్రంలో కనిపించాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కొమరం తన జీవితంలోని చేదు అనుభవాలను షేర్‌ చేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు.

టైలరింగ్ చేస్తూ డబ్బులు వేసేది..

‘నేను ఇండస్ట్రీలోకి రాకముందు అన్ని రకాల పనులు చేశా. హైదరాబాద్‌లోని సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు, గొడుగులు అమ్మా. కోఠిలో నిలబడి వస్తువులు విక్రయించా. హోటల్‌లో కూడా పని చేశా. పాత్రలు కడిగిన రోజులున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా చాలా ఇబ్బందులు పడ్డా. కానీ సక్సెస్ అయ్యాను. ఐదేళ్లు లైఫ్‌లో ఇబ్బందులు పడ్డా. అలాంటి పరిస్థితులు మళ్లీ రావొద్దని కోరుకుంటా. అవీ తలుచుకుంటే ఏడుపొచ్చేది. మా నానమ్మ చనిపోయినప్పుడు చాలా బాధేసింది. మా అమ్మ కూడా సినిమాల్లోకి పోమ్మని చెప్పేది. మా చెల్లెలు అంటే నాకు పిచ్చి ప్రాణం. కెరీర్‌ ప్రారంభంలో నా భార్య (రజిత)ఐదేళ్ల పాటు రాత్రింబవళ్లు టైలరింగ్ చేసి నాకు నెలకు రూ.3 వేలు అకౌంట్లో వేసేది. నా భార్య లేకపోతే నేను లేను’ అని ఎమోషనల్‌ అయ్యాడు కొమరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..