పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కీ. వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నారు. ముందుగా సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. సలార్ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా పై రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమాలో స్టార్ దర్శకుడు రాజమౌళి నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ మూవీలో మరో కీలక పాత్రలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వ్యూహం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది.
మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో కొత్త ప్రపంచం చూపించనున్నారు. 2898 లో ప్రపంచం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. మరి కల్కీ సినిమాలో రాజమౌళి, ఆర్జీవీ పాత్రలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది మే లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥
Here’s a small glimpse into our world: https://t.co/M95e8kZ63O#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/jaYnDhFeBP
— Kalki 2898 AD (@Kalki2898AD) July 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.