
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. చివరిగా చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నారు చరణ్. ఈ క్రమంలోనే బుచ్చి బాబుతో సినిమా చేస్తున్నారు. పెద్ది అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే పెద్ది సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చరణ్. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రంగస్థలం సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు చరణ్ తో సినిమా చేయడానికి ఓ దర్శకుడు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబో ఆల్ మోస్ట్ కన్ఫార్మ్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఆ దర్శకుడితో సినిమా అంటే చరణ్ అభిమానులు కంగారు పడుతున్నారు. వద్దు బాబోయ్ అంటున్నారు ఇంతకూ ఆ దర్శకుడు ఎవరో కాదు మెహర్ రమేష్.
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు దర్శకుడు మెహర్ రమేష్. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో బిల్లా సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. చివరిగా వచ్చిన భోళా శంకర్ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ దర్శకుడు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.. ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్, వెంకటేష్ లతో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ రెండు సినిమాలు కంత్రి, శక్తి సినిమా చేశాడు. కానీ ఆ రెండు డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు చరణ్ తో మెహర్ రమేష్ సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఇది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.