AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: క్రేజీ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌తో ప్రభాస్ సినిమా చేయనున్నాడా..?

ఇక ఈ సినిమా పై బోలెడన్ని వివాదాలు వచ్చాయి. అయితే ఎన్ని వివాదాలు వచ్చినప్పటికీ ఈ సినిమా కు కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయి. ఇదిలా ప్రభాస్ ఈ మూవీ తర్వాత సలార్ అనే సినిమా చేస్తున్నాడు.

Prabhas: క్రేజీ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌తో ప్రభాస్ సినిమా చేయనున్నాడా..?
Prabhas
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2023 | 7:20 AM

Share

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించారు. అలాగే సీతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్ నటించింది. ఇక ఈ సినిమా పై బోలెడన్ని వివాదాలు వచ్చాయి. అయితే ఎన్ని వివాదాలు వచ్చినప్పటికీ ఈ సినిమా కు కలెక్షన్స్ మాత్రం భారీగానే వస్తున్నాయి. ఇదిలా ప్రభాస్ ఈ మూవీ తర్వాత సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతర్వాత మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రాయల్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఇక వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ తో కలిసి స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో దర్శకుడితో సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యారని తెలుస్తోంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేయనున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , గ్లింమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక హరీష్ శంకర్ ప్రభాస్ తో సినిమా చేస్తే అదిరిపోతుందని అంటున్నారు ఫ్యాన్స్. హరీష్ శంకర్ మేకింగ్.. హీరో ఎలివేషన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ టాక్ విని ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!