prabhas: ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ల సినిమా మరింత ఆలస్యం కానుందా.? డార్లింగ్‌ ఓకే చెబుతోన్న వరుస సినిమాలే దీనికి కారణమా.?

|

Jul 06, 2021 | 6:37 PM

Prabhas: ప్రభాస్‌.. ఇప్పుడీ పేరు దేశ వ్యాప్తంగా ఓ సంచలనం. ప్రభాస్‌ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ అయినా వైరల్‌గా మారాల్సిందే. బాహుబలితో ఒక్కసారిగా నేసషనల్‌ హీరోగా మారారు ప్రభాస్‌. దీంతో ఈ స్టార్‌ హీరో తర్వాతి చిత్రాలు కూడా..

prabhas: ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ల సినిమా మరింత ఆలస్యం కానుందా.? డార్లింగ్‌ ఓకే చెబుతోన్న వరుస సినిమాలే దీనికి కారణమా.?
Prabhas Nag Aswin
Follow us on

Prabhas: ప్రభాస్‌.. ఇప్పుడీ పేరు దేశ వ్యాప్తంగా ఓ సంచలనం. ప్రభాస్‌ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్‌ అయినా వైరల్‌గా మారాల్సిందే. బాహుబలితో ఒక్కసారిగా నేసషనల్‌ హీరోగా మారారు ప్రభాస్‌. దీంతో ఈ స్టార్‌ హీరో తర్వాతి చిత్రాలు కూడా అదే స్థాయిలో రానున్నాయి. దర్శక, నిర్మాతలు సైతం ప్రభాస్‌ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు తెరకెక్కించే పరిస్థితులు వచ్చాయి. ప్రస్తుతం రాధే శ్యామ్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవతోన్న ప్రభాస్‌.. తర్వాతి చిత్రాల విషయంలో దూకుడు పెంచారు. వరుస సినిమాలకు ఓకే చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండియాగా మారారు.

ప్రభాస్‌ పట్టాలెక్కించనున్న సినిమాల్లో మహానటి ఫేమ్‌ నాగ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న సినిమా ఒకటి. టైమ్‌ ట్రావెలింగ్ అనే వినూత్న కాన్సెప్ట్‌తో రానున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీగా అంచనాలనున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే దర్శకుడు అశ్విన్‌ కూడా ఈ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రభాస్‌ వరుసగా ఓకే చెబుతోన్న సినిమాలే. ప్రస్తుతం ప్రభాస్‌.. ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తి కాక ముందే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిలో.. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ చిత్రం ఒకటి కాగా.. మరో చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ ఫేమ్‌ సుధ కొంగర దర్శకత్వం వహించనున్న సినిమా. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్‌-నాగ అశ్విన్‌ల సినిమా ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే పట్టాలెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తలే కనుక నిజమయితే టైమ్‌ మిషన్‌లాంటి వినూత్న కథాంశంతో రానున్న ఆ సిల్వర్‌ స్క్రీన్‌ సెల్యులాయిడ్‌కు తక్కువలో తక్కువ నాలుగేళ్లయిన పట్టే అవకాశాలున్నాయన్నమాట. మరి నాగ అశ్విన్‌ అప్పటి వరకు వేచి ఉంటాడా.? లేదా మధ్యలో ఉండే గ్యాప్‌లో సినిమా మొదలు పెడతాడో చూడాలి.

Also Read: Congress infight: మరింత రంజుగా కాంగ్రెస్ రాజకీయాలు.. పోరు తీర్చేపనిలో ఆ పార్టీ అధ్యక్షురాలు.. ఏం తేలేనో..!

Viral Video: దర్జాగా రోడ్డుపై సింహాల నైట్ వాక్.. దడుసుకున్న స్థానికులు.. వీడియో వైరల్.!

Singer Sunitha: మధురమైన గాత్రం.. చూడచక్కని రూపం.. వైరల్ అవుతున్న సింగర్ సునీత పోస్ట్..