
ప్రస్తుతం వెంకటేష్ జోరు పెంచారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాలో స్పెషల్ రోల్ చేశారు వెంకీ. సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు రెండు సినిమాలతో రాబోతున్నారు వెంకీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా, అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు. ఇక వెంకటేష్ నటిస్తున్న సినిమాల్లో ఆదర్శ కుటుంబం AK 47 చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన భారీ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేశారు. జెట్ స్పీడ్ షూటింగ్ తో దూసుకుపోతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. మొన్నామధ్య ఈ సినిమా నుంచి వరుసగా గ్లింప్స్ ను విడుదల చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. అదేంటంటే ఆదర్శ కుటుంబంలోకి ఓ స్టార్ హీరో కూడా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఆయన మరెవరో కాదు స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అవును ఎన్టీఆర్ ఆదర్శకుటుంబంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడంలేదు. కేవలం వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నారని తెలుస్తుంది. గతంలో వెంకటేష్ నటించిన చింతకాయల రవి సినిమాలో ఓ సాంగ్ లో ఎన్టీఆర్ అలా కనిపించి రెండు స్టెప్పులేస్తారు.
ఇక ఇప్పుడు వెంకీ సినిమాకు తారక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కు కూడా మంచి బాండింగ్ ఉంది. ఈ ఇద్దరూ కలిసి అరవింద సమేత అనే సినిమా చేశారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ స్నేహంతోనే ఇప్పుడు ఆదర్శ కుటుంబానికి తారక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఇటీవలే అఖిల్ లెనిన్ సినిమాకు కూడా ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చారు. ఇక ఆదర్శకుటుంబం సినిమా కామెడీ, క్రైమ్, డ్రామా, ఫ్యామిలీ, థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.